Paradise Climax: నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ది పారడైజ్' (The Paradise) క్లైమాక్స్ షూటింగ్ గురించి బయటికొచ్చిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
దసరా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
నిజానికి ఈ మూవీ మార్చి 2026 లో రిలీజ్ కావాల్సింది. ఆ తర్వాత ఆగస్టుకు షిఫ్ట్ అయి ఇప్పుడు ఫైనల్ గా సెప్టెంబర్ 2026 కి లాక్ అవ్వబోతోందని ఇండస్ట్రీ టాక్. రిలీజ్ లేట్ అవుతుండటంతో ఫ్యాన్స్ కొంచెం డల్ అయ్యారు. సరిగ్గా ఈ టైమ్ లో పాపులర్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ పెట్టిన ఒక పోస్ట్ నాని ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.
ఆపుకోలేక పెడుతున్నా
ఈ పారడైజ్ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్స్ షూటింగ్ చూసి తనకే మతిపోయిందని శ్యామ్ ఓపెన్ గా చెప్పేశాడు. తన ట్వీట్ ను సేవ్ చేసి పెట్టుకోమని, ది పారడైజ్ క్లైమాక్స్ ఆడియన్స్ కు ఒక నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని శ్యామ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఒక పాన్ ఇండియా అప్పీల్ కోసం శ్రీకాంత్ ఓదెల ఈ ఎపిసోడ్ ను చాలా భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాని మార్క్ యాక్టింగ్, దానికి తోడు భారీ యాక్షన్ బ్లాక్స్ ఈ ఎండింగ్ లో ఉండబోతున్నాయట.
"క్లైమాక్స్ పారడైజ్.. నా ట్వీట్ రాసి పెట్టుకోండి.. ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నా.. ఆపుకోలేక పెడుతున్నా.." అంటూ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను ట్యాగ్ చేశాడు.
అనిరుధ్ మ్యూాజిక్
ఈ భారీ ప్రాజెక్టుకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్ ఇస్తున్నాడు. నాని సినిమాకు అనిరుధ్ బీజీఎమ్ ఇస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాల్లో చూశాం. ఇప్పుడు ఈ ఫుల్ లెంగ్త్ మాస్ మూవీకి అనిరుధ్ ఇస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో స్పీకర్లు బద్దలు కొట్టడం గ్యారెంటీ అని మేకర్స్ చెప్తున్నారు. ఫ్యాన్స్ ఇప్పుడు మ్యూజికల్ అప్డేట్ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.
భారీ తారాగణంతో..
ది పారడైజ్ కాస్టింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) ఒక పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ లో నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. కయదు లోహార్ హీరోయిన్ గా చేస్తుండగా.. సోనాలి కులకర్ణి, బాబు మోహన్, తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ యాక్టర్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ఒక సర్‌ప్రైజ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్ (SLV Cinemas) బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ది పారడైజ్ విశేషాలు
* నటీనటులు: నాని, కయదు లోహర్, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్
* డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల
* మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్ రవిచందర్
* ప్రొడ్యూసర్: సుధాకర్ చెరుకూరి
Hari Prasad S, Hyderabad

