Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Part Timers OTT: బిగ్‌బాస్ తనూజ ఓటీటీ ఎంట్రీ.. జియోహాట్‌స్టార్‌లో పార్ట్ టైమర్స్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. కథేంటంటే?

Part Timers OTT: బిగ్‌బాస్ తనూజ ఓటీటీ ఎంట్రీ.. జియోహాట్‌స్టార్‌లో పార్ట్ టైమర్స్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. కథేంటంటే?

Part Timers OTT: తెలుగు బుల్లితెరపై 'ముద్ద మందారం' (Mudda Mandaram) సీరియల్‌లోని పార్వతి పాత్రతో సుమారు 1500 ఎపిసోడ్ల పాటు వీక్షకులను అలరించిన నటి తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy) ఓటీటీలో అడుగుపెడుతోంది.

డిజిటల్ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆమె కీలక పాత్ర పోషించిన 'పార్ట్ టైమర్స్' వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది.

తనూజ ఓటీటీ ఎంట్రీ

బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 9లో తన నిజాయితీగల ప్రవర్తనతో రన్నరప్‌గా నిలిచి విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న తనూజ.. నేరుగా ఓటీటీ ప్రైమ్‌టైమ్‌లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) నిర్మించిన సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ 'పార్ట్ టైమర్స్' (#PartTimers) లో తనూజ ఓ హీరోయిన్.

పార్ట్ టైమర్స్ స్ట్రీమింగ్ వివరాలు

జియోహాట్‌స్టార్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్లు, ప్రమోషనల్ అప్‌డేట్స్ ప్రకారం ఈ సిరీస్ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. పార్ట్ టైమర్స్ సిరీస్ ఆగస్టు 28 నుంచి జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో తనూజతో పాటు ప్రముఖ నటి జ్ఞానేశ్వరి కాండ్రేగుల (Gnaneswari Kandregula) మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.

స్టోరీ ఏంటంటే?

"పార్ట్ టైమ్ జాబ్స్.. ఫుల్ టైమ్ డ్రీమ్స్" అనే కాన్సెప్ట్‌తో ఈ పార్ట్ టైమర్స్ సిరీస్ తెరకెక్కింది. 30 ఏళ్ల వయసు రాకముందే వ్యాపార రంగంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని విజయం సాధించాలని కలలుకనే ఇద్దరు యువతుల కథాంశంతో ఇది రూపొందింది. మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తూనే తమ కలలను నెరవేర్చుకోవడానికి యువత పడే తపనను కామెడీ, ఎమోషన్స్ కలగలిపి వర్క్‌ప్లేస్ డ్రామాగా తీర్చిదిద్దారు.

బుల్లితెర క్రేజ్ నుంచి ఓటీటీ వరకు

కన్నడ చిత్రం '6-5=2', తెలుగులో 'లీగల్లీ వీర్' వంటి సినిమాల్లో నటించినప్పటికీ తనూజకు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగు సీరియళ్లే. 'ముద్ద మందారం', 'అగ్నిపరీక్ష' సీరియళ్ల ద్వారా ప్రతి ఇంట్లో చెల్లెలిగా, కూతురిగా స్థానం సంపాదించుకున్న ఆమె.. బిగ్‌బాస్ హౌస్‌లో తన గేమ్ ప్లాన్‌తో యూత్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నారు.

బిగ్‌బాస్ ముగిసిన తర్వాత హాట్‌స్టార్ స్పెషల్స్ సిరీస్‌తో లీడ్ రోల్‌లో రావడం ఆమె కెరీర్‌కు డిజిటల్ స్పేస్‌లో పెద్ద బూస్ట్‌గా మారనుంది. బిగ్‌బాస్ విజేత కళ్యాణ్ పడాల సహా పలువురు సహచర నటులు ఆమె ఓటీటీ డెబ్యూపై హర్షం వ్యక్తం చేస్తూ బెస్ట్ విషెస్ తెలిపారు. మరి ఓటీటీలో పార్ట్ టైమర్స్ సిరీస్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu