Peddi: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో 'పెద్ది' ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్, సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
మొత్తానికి జూన్ 4న సినిమా థియేటర్లకు రానుందని రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు.
పెద్ది రిలీజ్ డేట్
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీకి బుచ్చిబాబు సాన డైరెక్టర్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. శ్రుతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో ఆడిపాడిందని సమాచారం.
కొత్త పోస్టర్
పెద్ది మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ చిత్రం మరో 30 రోజుల్లో రిలీజ్ కాబోతుందని మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం (మే 5) ఓ కొత్త పోస్టర్ పంచుకుంది. ''30 రోజుల్లో అతని కథ ప్రారంభం. జూన్ 4న పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పెద్ది కోసం రెడీగా ఉండండి'' అని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.
నమ్మకం లేదు దొరా
పెద్ది రిలీజ్ కోసం ఓ వైపు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేకర్స్ కూడా అప్ డేట్స్ పంచుకుంటున్నారు. అయినా పెద్ది మూవీ చెప్పిన రోజు థియేటర్లకు వస్తుందనే నమ్మకం లేదు దొరా అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అదే కారణం
పెద్ది మూవీ విడుదలపై నమ్మకం లేకపోవడానికి ఓ కారణం ఉంది. ఫస్ట్ ఈ మూవీని మార్చి 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. కనీసం ఏప్రిల్ 30కి అయినా రిలీజ్ చేశారా? అంటే అదీ లేదు. మళ్లీ జూన్ కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
జూన్ 25న రిలీజ్ చేస్తామన్నారు. కానీ లాస్ట్ కు జూన్ 4న పెద్ది వస్తుందని చెప్పారు. ఇలా రిలీజ్ పై ఎప్పటికప్పుడు మేకర్స్ మాట మార్చడంతో అభిమానుల్లో నమ్మకం పోయింది. పెద్ది మూవీ థియేటర్లకు వచ్చేంతవరకూ కూడా రిలీజ్ డేట్ పై భరోసా పెట్టుకోలేని పరిస్థితి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Chandu Shanigarapu

