మోస్ట్ అవైైటెడ్ సినిమాల్లో రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' ఒకటి. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమా ఓటీటీ డీల్ కు కళ్లు చెదిరే రేటు పలికిందని సమాచారం. ఇప్పుడు ఈ బజ్ తెగ ట్రెండ్ అవుతోంది. పెద్ది ఓటీటీ రేటు హాట్ టాపిక్ గా మారింది.
పెద్ది ఓటీటీ
రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పెద్ది మూవీ ఓటీటీ డీల్ ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఓటీటీ డీల్ రేట్ విషయంపై తాజా బజ్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ ను స్పష్టం చేస్తోంది.
డీల్ అదుర్స్
పెద్ది సినిమా ఓటీటీ తాజా డీల్ రేటు సెన్సేషన్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలిసింది.
బోనస్ కూడా
పెద్ది మూవీ ఓటీటీ డీల్ లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ మరో బోనస్ ఆఫర్ కూడా ప్రకటించినట్లు తెలిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అదనంగా రూ.20 కోట్లను నెట్‌ఫ్లిక్స్ చెల్లించనున్నట్లు టాక్. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత పెద్ది మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
వేరే లెవల్ హైప్
హీరో గ్లింప్స్, సాంగ్స్, పహిల్వాన్ గ్లింప్స్ తో పెద్ది సినిమాపై హైప్ వేరే లెవల్ కు చేరింది. ఇందులో గ్రామీణ క్రీడాకారుడిగా రామ్ చరణ్ నటించాడు. క్రికెటర్ గా మాత్రమే కాకుండా కుస్తీ యోధుడిగానూ ఆడియన్స్ ను అలరించబోతున్నాయి. అయితే ఈ రెండు ఆటలతో పాటు చరణ్ మరో గేమ్ కూడా ఆడతాడని సమాచారం.
రిలీజ్ డేట్
ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పెద్ది మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ రీసెంట్ గా రామ్ చరణ్ ఈ ప్రచారాన్ని ఖండించాడు. ఏప్రిల్ 30నే పెద్ది రిలీజ్ అవుతుందని మరోసారి క్లారిటీనిచ్చాడు. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
Chandu Shanigarapu

