Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పునర్వసు నక్షత్రంలోకి కుజుడు.. ఈ 3 రాశులకు కెరీర్, డబ్బు విషయంలో జాక్‌పాట్!

పునర్వసు నక్షత్రంలోకి కుజుడు.. ఈ 3 రాశులకు కెరీర్, డబ్బు విషయంలో జాక్‌పాట్!

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది.

కొన్నిసార్లు గ్రహాల సంచారం కారణంగా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మాత్రం సమస్యలు ఎదురవుతాయి.

కుజుడు సెప్టెంబర్ 2, అంటే రేపు, మధ్యాహ్నం 1:25 నిమిషాలకు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 24 వరకు కుజుడు ఇదే నక్షత్రంలో సంచారాన్ని కొనసాగిస్తాడు. పునర్వసు నక్షత్రానికి అధిపతి వచ్చేసి గురువు. జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, గురువుని అదృష్టం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. కుజుడిని శక్తి, ధైర్యం, భూమికి కారక గ్రహంగా భావిస్తారు. అయితే కుజుడి నక్షత్ర సంచారంలో మార్పు రావడంతో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం విపరీతంగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

కుజ నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి పండగే.. అనుకోని విధంగా బోలెడు లాభాలు!

1.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా భారీగా లాభాలను పొందుతారు.

కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను తీసుకొస్తాయి. కెరీర్‌లో ఈ రాశి వారు దూసుకెళ్లిపోతారు. దూర ప్రయాణాలు చేస్తే కూడా అవకాశాలు కలిసి వస్తాయి.

2.మకర రాశి

మకర రాశి వారికి ఇది అదృష్ట సమయం అని చెప్పొచ్చు. ఈ రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఎప్పటి నుంచి నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇటు వరకు నిలిచిపోయిన పని విజయవంతంగా పూర్తి చేస్తారు. మనసుకు సంతోషం కలుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. కెరీర్, ఆర్థిక విషయాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.

3.కన్యా రాశి

ఈ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. కన్యా రాశి వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. కెరీర్, వ్యాపార రంగాల్లో కన్యా రాశి వారు ఆశించిన విజయాలను పొందుతారు.

పెట్టుబడుల ద్వారా మంచి ఫలితాలను చూస్తారు. ఆఫీస్‌లో కష్టపడి పనిచేస్తే ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలను పొందుతారు. కెరీర్‌లో ఇవి విజయ అవకాశాలుగా మారుతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు.

Peddinti Sravya, hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu