Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పూర్వఫల్గుని నక్షత్రంలోకి బుధుడు - ఇవాళ్టి నుంచి అదృష్టం చూడబోయే 5 రాశులివే!

పూర్వఫల్గుని నక్షత్రంలోకి బుధుడు - ఇవాళ్టి నుంచి అదృష్టం చూడబోయే 5 రాశులివే!

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికలు, రాశి మరియు నక్షత్ర పరివర్తనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బుద్ధి, వ్యాపారం, వాక్కు మరియు తార్కిక శక్తికి కారకుడైన గ్రహాల యువరాజు 'బుధుడు' తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు.

ప్రస్తుతం సూర్యుడికి చెందిన సింహరాశిలో సంచరిస్తున్న బుధుడు…. నేటి నుంచి శుక్రుడికి చెందిన 'పూర్వ ఫాల్గుణి' నక్షత్రంలోకి ప్రవేశించాడు.

హిందూ క్యాలెండర్, పంచాంగం ప్రకారం….. బుధుడు సెప్టెంబర్ 5, 2026 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐశ్వర్యానికి, భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడి నక్షత్రంలోకి బుధుడు చేరడం వల్ల రాబోయే 7 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం మెరిసి, ఊహించని ధనలాభం కలగనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు, వాటి ఫలితాలు ఇవే…

1. మిథున రాశి :

మిథున రాశి వారికి ఈ నక్షత్ర సంచారం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. మీ రాశి అధిపతి బుధుడే కావడం వల్ల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఆర్థికంగా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో నూతన బాధ్యతలు లభిస్తాయి. మీరు కనబరిచే ప్రతిభ వల్ల ఉద్యోగంలో పదోన్నతి (ప్రమోషన్) లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సంపద పెరిగి, కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.

2. తులా రాశి :

తులా రాశి వారికి బుధుడి నక్షత్ర మార్పు అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. చాలా కాలం తర్వాత ఆత్మీయ స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం బంగారు అవకాశాలను తెచ్చిపెడుతుంది. కొత్త ప్రాజెక్టులు దక్కడం లేదా పాత వ్యాపారాల నుంచి లాభాలు రావడం ద్వారా మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది.

3. మకర రాశి :

మకర రాశి జాతకులకు కూడా ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి, దాంపత్య జీవితంలో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు సంబంధించిన శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన పనులు వేగవంతమై లాభాలను అందిస్తాయి.

4. వృషభ రాశి :

వృషభ రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా నిలుస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఎంతో అనుకూలమైన కాలం. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు క్రమక్రమంగా తొలగిపోతాయి. కొత్త రాబడి మార్గాలు సుగమం కావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

బుధుడి ఈ నక్షత్ర సంచారం సెప్టెంబర్ 5 వరకు కొనసాగుతుండటంతో…. ఈ 5 రాశుల వారు సద్వినియోగానికి తగిన ప్రణాళికలు చేసుకుంటే వ్యాపార, ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించవచ్చు.

Maheshwaram Mahendra Chary, नई दिल्ली

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu