జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస.
ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.
పాజిటివ్ టాక్
సంగీత్ శోభన్ సోలో హీరోగా తెరకెక్కిన రాకాస సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది. రాకాస సినిమాకు విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ దక్కింది. ఈ క్రమంలో సినిమా విడుదలైన శుక్రవారం (ఏప్రిల్ 3) నాడు చిత్ర యూనిట్ రాకాస బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "'రాకాస' మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్కువగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు? అని అనుకున్నామో అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా 'రాకాస'ని చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. విడుదలైన ప్రతీ చోటా మా 'రాకాస'కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది" అని అన్నారు.
సంగీత్ శోభన్ కామెంట్స్
హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. "'రాకాస'కి ప్రీమియర్ల నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు కూడా అంతే స్థాయిలో ఆదరణ దక్కుతోంది. పిల్లలతో సహా పేరెంట్స్ ఈ మూవీకి వస్తున్నారు. పిల్లలు ఈ చిత్రాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీడియా కూడా మా సినిమాని చూస్తూ చాలా ఎంజాయ్ చేసింది. మా మూవీని ఎంకరేజ్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని చెప్పాడు.
"'రాకాస' రెస్పాన్స్ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే నా ఫ్యామిలీ. ప్రీమియర్ల నుంచే మాకు అద్భుతమైన ఆదరణ దక్కింది. అన్ని వర్గాల ఆడియెన్స్ మా మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ సక్సెస్ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది" అని హీరోయిన్ నయన్ సారిక పేర్కొంది.
మానస శర్మ స్పీచ్
డైరెక్టర్ మానస శర్మ మాట్లాడుతూ .. "'రాకాస' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చందమామ లాంటి కథ అని మేం ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. అదే విషయాన్ని ప్రేక్షకుల వరకు మీడియా రీచ్ అయ్యేలా చేసింది. ఇప్పుడు థియేటర్లో వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందమేస్తోంది" అని తెలిపారు.
"చాలా చోట్ల ఆడియెన్స్ పగలబడి నవ్వేస్తున్నారు. అంతలా ప్రేక్షకులు మా సినిమా ఆస్వాదిస్తూ చూస్తుంటే సంతోషంగా ఉంది. మా సినిమాని ఇంకా ఇలానే ఆదరిస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని ఆడియెన్స్‌ని కోరుకుంటున్నాను" అని దర్శకురాలు మానస శర్మ ఆకాంక్షించారు.
ఫ్యామిలీతో చూడండి
సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. "'రాకాస' అందరికీ నచ్చుతోంది. ఆడియెన్స్ ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు? అని మేం అనుకున్నామో.. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. ఫ్యామిలీతో కలిసి మా చిత్రాన్ని చూడండి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు" అని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే, జీ స్టూడియో కంటెంట్ హెడ్ దివ్య మాట్లాడుతూ .. "'రాకాస'కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్‌కి మా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి" అని అన్నారు.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

