రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన సమాచారం అందించింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వైపు ప్రయాణించే ప్యాసింజర్ రైలు సమయాల్లో మార్పులు జరిగాయి.
మిర్యాలగూడ-కాచిగూడ (రైలు నంబర్ 67776)ప్యాసింజర్ కొత్త వేళలు జూలై 10, 2026 నుండి ప్రారంభమయ్యే ప్రయాణాలకు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.
నిర్వహణ పరమైన కారణాల వల్ల కొన్ని రైళ్లను మల్కాజ్‌గిరి రూట్‌కు బదులుగా చర్లపల్లి - మౌలా అలీ - లల్లాగూడ - సీతాఫల్‌మండి మీదుగా మళ్లించడమే ఈ సమయాల మార్పునకు ప్రధాన కారణం. మిర్యాలగూడ - నాగిరెడ్డిపల్లి మధ్య ఉన్న మిగిలిన స్టేషన్లలో రైలు సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు.
పాత, కొత్త సమయాల పూర్తి వివరాలు:
- మిర్యాలగూడ : ఈ స్టేషన్ నుండి రైలు బయలుదేరే పాత సమయం, కొత్త సమయం ఒకటే. ఉదయం 05:35 గంటలకు రైలు ఇక్కడి నుండి కదులుతుంది.
- బీబీనగర్ : పాత సమయం ఉదయం 07:59/08:00 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 07:54కు చేరుకుని 07:55కు బయలుదేరుతుంది.
- ఘట్‌కేసర్ : పాత సమయం ఉదయం 08:09/08:10 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 08:05కు చేరుకుని 08:06కు బయలుదేరుతుంది.
- చర్లపల్లి : పాత సమయం ఉదయం 08:19/08:20 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 08:15కు చేరుకుని 08:16కు బయలుదేరుతుంది.
- మల్కాజ్‌గిరి : పాత సమయం ఉదయం 09:44/09:45 కాగా….. కొత్త సమయం ప్రకారం ఉదయం 08:39కు చేరుకుని 08:40కు బయలుదేరుతుంది.
- సీతాఫల్‌మండి : పాత సమయం ఉదయం 09:54/09:55 కాగా…. కొత్త సమయం ప్రకారం ఉదయం 08:54కు చేరుకుని 08:55కు బయలుదేరుతుంది.
- ఆర్ట్స్ కాలేజ్ : పాత సమయం ఉదయం 09:56/09:57 కాగా…. కొత్త సమయం ప్రకారం ఉదయం 08:57కు చేరుకుని 08:58కు బయలుదేరుతుంది.
- జామై ఉస్మానియా : పాత సమయం ఉదయం 09:58/09:59 కాగా…. కొత్త సమయం ప్రకారం ఉదయం 09:00కు చేరుకుని 09:01కు బయలుదేరుతుంది.
- విద్యానగర్ : పాత సమయం ఉదయం 10:00/10:01 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 09:04కు చేరుకుని 09:05కు బయలుదేరుతుంది.
- కాచిగూడ : ఈ రైలు చివరి స్టేషన్ అయిన కాచిగూడకు పాత సమయం ప్రకారమే ఉదయం 10:20 గంటలకు చేరుకుంటుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు.
మల్కాజ్‌గిరి నుంచి విద్యానగర్ మధ్య ఉన్న స్టేషన్లలో రైలు నిమిషాల వ్యవధి ముందే రానుంది. కాబట్టి ప్రయాణికులు ఈ కొత్త సమయ పట్టికను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Maheshwaram Mahendra Chary

