Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Salman Khan: నేను 16 కేజీలు తగ్గాను.. సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు చెక్.. ఓటీటీ షోలో షాకింగ్ ట్విస్ట్!

Salman Khan: నేను 16 కేజీలు తగ్గాను.. సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు చెక్.. ఓటీటీ షోలో షాకింగ్ ట్విస్ట్!

Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవలి అతను చాలా సన్నగా, లీన్‌గా కనిపించడంతో అభిమానులు సల్మాన్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అతను ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారా? అనే ప్రచారాలు కూడా సాగాయి. అయితే, ఈ రూమర్లు అన్నింటికీ సల్మాన్ ఖానే నేరుగా సమాధానమిచ్చాడు.

ఓటీటీ షోలో

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోలో ప్రసారమవుతున్న రియాలిటీ షో 'అలియన్స్' (Alliance) ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ సందడి చేశాడు. ఈ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న తన సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) ను కలిసేందుకు వచ్చిన భాయిజాన్, తన ఫిట్‌నెస్ సీక్రెట్‌తో పాటు బరువు తగ్గడం వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడించాడు.

నేను 16 కేజీలు తగ్గాను

'అలియన్స్' షోలో సోహైల్ ఖాన్‌తో సల్మాన్ జరిపిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సోహైల్‌ను చూసిన సల్మాన్ "నువ్వు బాగా బరువు తగ్గావ్" అని అనగా.. సోహైల్ తన సిక్స్ ప్యాక్ అబ్స్ చూపిస్తూ తాను 12 కేజీలు తగ్గానని చెప్పాడు. దీనికి సల్మాన్ స్పందిస్తూ.. "నేను ఏకంగా 16 కేజీలు తగ్గాను" అని రివీల్ చేసి ఆశ్చర్యపరిచాడు.

హెల్త్ రూమర్లకు చెక్

ముంబైలోని మురికివాడల పునరావాస ప్రాధికార సంస్థ (SRA) డేటా కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో సల్మాన్ చాలా సన్నగా కనిపించడంతో ఈ హెల్త్ రూమర్లు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అంతా తను అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగిందే తప్ప అనారోగ్యం కాదని స్పష్టమైంది.

'అలియన్స్' షో విశేషాలు

కునాల్ ఖేము వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అలియన్స్' షో జూన్ 26 నుంచి ప్రసారమవుతోంది. 16 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు జోడీలు (అలైస్) గా ఏర్పడి ఇందులో పోటీపడుతున్నారు. రవికిషన్-రివా కిషన్, కుశాల్ టాండన్-అర్స్లాన్ గోని, డైసీ షా-జైద్ దర్బార్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు.

'SVC 63' కోసమేనా?

సల్మాన్ ఖాన్ ఇంతలా బరువు తగ్గడానికి ఖచ్చితమైన కారణం చెప్పనప్పటికీ, అతని రాబోయే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'SVC 63' (తాత్కాలిక పేరు) కోసమే ఈ మేకోవర్ అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోని పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సుల కోసమే సల్మాన్ ఈ రేంజ్‌లో ఫిట్‌నెస్‌ సాధించినట్లు సమాచారం.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu