Dailyhunt
Samantha Naga Chaitanya: ఒకే పెళ్లిలో సమంత నాగ చైతన్య- వేర్వేరు జంటలుగా సందడి-ఒకరినొకరు పలకరించుకున్నారా? నాగ్ అమల కూడా!

Samantha Naga Chaitanya: ఒకే పెళ్లిలో సమంత నాగ చైతన్య- వేర్వేరు జంటలుగా సందడి-ఒకరినొకరు పలకరించుకున్నారా? నాగ్ అమల కూడా!

Samantha Naga Chaitanya In Wedding: ఏషియన్ సినిమాస్ అధినేత, ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ నారంగ్ వివాహ రిసెప్షన్ శనివారం (మే 2) సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి దిగ్గజాలు విచ్చేశారు.

బిజీగా ఉన్నప్పటికీ

అలాగే, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులతో సిమ్రాన్ నారంగ్ రిసెప్షన్ వేదిక కళకళలాడింది. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, సునీల్ నారంగ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కట్టారు.

ఒకే వేదికపై మాజీ జంట

ఈ వేడుకలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. విడిపోయిన తర్వాత సమంత, నాగచైతన్య ఒకే కార్యక్రమానికి హాజరు కావడం చాలా అరుదు. అయితే ఈ రిసెప్షన్‌లో వీరిద్దరూ తమ ప్రస్తుత భాగస్వాములతో (లైఫ్ పార్టనర్స్) కలిసి సందడి చేశారు. సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి రాగా.. నాగ చైతన్య తన భార్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో కలిసి విచ్చేశారు.

సమంత ఊదా రంగు (పర్పుల్), గోల్డ్ బోర్డర్ ఉన్న చీరలో మెరిసిపోగా.. రాజ్ సూట్ ధరించి కనిపించారు. మరోవైపు చైతన్య తన తండ్రి నాగార్జున (నాగ్), తల్లి అమలతో కలిసి వచ్చారు. శోభిత నీలం, గులాబీ రంగు మిళితమైన చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజ్ మీదకు వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించే సమయంలో నాగ చైతన్య, శోభితా జంట కెమెరా కళ్లకు చిక్కారు.

సోషల్ మీడియాలో చర్చ.. అభిమానుల ఆసక్తి

సమంత, నాగచైతన్య ఒకే పెళ్లికి రావడంతో నెట్టింట చర్చ మొదలైంది. "వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారా? ముఖాముఖి కలిశారా?" అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే వీరు కలిసినట్టు ఎక్కడా ఫొటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాలేదు. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా ఉన్నారని, పాత విషయాలను పక్కన పెట్టి ముందుకు సాగడం మంచిదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గతాన్ని దాటి.. కొత్త జీవితంలోకి

'ఏ మాయ చేసావె' సినిమాతో మొదలైన సమంత-నాగ చైతన్య ప్రయాణం 2017లో వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ చైతన్య 2024 డిసెంబర్‌లో శోభితను పెళ్లాడగా.. సమంత 2025 డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.

హారర్ థ్రిల్లర్ చిత్రం

ప్రస్తుతం నాగ చైతన్య 'వృషకర్మ' అనే సోషియో ఫాంటసీ హారర్ థ్రిల్లర్ చిత్రంతో బిజీగా ఉండగా.. సమంత 'మా ఇంటి బంగారం', 'రక్త బ్రహ్మాండం' వంటి క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే, ఒకే పెళ్లిలో వేర్వేరు జంటలుగా సమంత, నాగ చైతన్య హాజరు కావడం నెట్టింట ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సునీల్ నారంగ్ కుమార్తె రిసెప్షన్‌కు సమంత ఎవరితో కలిసి వచ్చారు?

సమంత తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

2. నాగచైతన్య, సమంత ఒకరినొకరు పలకరించుకున్నారా?

వీరిద్దరూ ఒకే వేడుకకు హాజరైనప్పటికీ, ఒకరినొకరు పలకరించుకున్నట్లు లేదా కలిసినట్లు ఎలాంటి ఫొటోలు గానీ, వీడియో ఆధారాలు గానీ లేవు.

3. సమంత, రాజ్ నిడిమోరు వివాహం ఎప్పుడు జరిగింది?

సమంత, రాజ్ 2025 డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో వివాహం చేసుకున్నారు.

4. నాగచైతన్య నటిస్తున్న తదుపరి చిత్రం ఏమిటి?

నాగచైతన్య ప్రస్తుతం 'వృషకర్మ' అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. అంతకుముందు ఆయన 'తండేల్' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu