ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీ అంటూ 'బైకర్'తో థియేటర్లకు వచ్చాడు శర్వానంద్. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మంచి టాక్ తో థియేటర్లలో బైకర్ మూవీకి ప్రేక్షకులు జై కొడుతున్నారు.
ఈ మూవీ సక్సెస్ తో శర్వానంద్ ఎమోషనల్ అయ్యాడు. ఓ థియేటర్లో స్క్రీన్ కు సాష్టాంగ నమస్కారం పెట్టాడు.
శర్వానంద్ సాష్టాంగ నమస్కారం
బైకర్ మూవీతో శర్వానంద్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం (ఏప్రిల్ 3)న రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ ఎమోషనల్ అయ్యాడు. హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్లో బిగ్ స్క్రీన్ కు శర్వానంద్ సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత తెరను ముట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ సమయంలో శర్వా ఎమోషనల్ అయ్యాడు.
వీడియో వైరల్
సినిమా థియేటర్లోని స్క్రీన్ కు శర్వానంద్ సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది శర్వాకు సినిమాపై ఉన్న ప్రేమ, గౌరవానికి నిదర్శనం అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. శర్వానంద్ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
బైకర్ గురించి
శర్వానంద్ బైక్ రేసర్ గా నటించిన మూవీ 'బైకర్'. ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీగా ఇది థియేటర్లకు వచ్చింది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్. సీనియర్ హీరో రాజశేఖర్ బైకర్ మూవీలో హీరోకు తండ్రిగా నటించాడు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ పై ప్రమోద్, వంశీ బైకర్ మూవీని నిర్మించారు.
బైకర్ స్టోరీ
వికాస్ నారాయణన్ అలియాస్ విక్కీ (శర్వానంద్) ఇండియాలోనే టాప్ రేసర్. తండ్రి సునీల్ నారాయణన్ (రాజశేఖర్) శిక్షణలో విక్కీ రేసింగ్ పై పట్టు సాధిస్తాడు. ఒకప్పుడు రేసింగ్ లో అదరగొట్టిన సునీల్ నారాయణన్ తన కొడుకును ప్రపంచ ఛాంపియన్ గా చూడాలనుకుంటాడు.
ఇండియాలో క్రికెట్ లాగే రేసింగ్ కు కూడా క్రేజ్ రావాలని సునీల్ కోరుకుంటాడు. తండ్రి దగ్గర ట్రైనింగ్ పొందిన విక్కీ రేస్ ట్రాక్ పై బైక్ ను పరుగులు పెట్టిస్తాడు. కానీ సడెన్ గా రేసింగ్ ను వదిలేసి వెళ్లిపోతాడు. సునీల్ కు అవమానం ఎదురవుతుంది.
మళ్లీ రేసింగ్
కట్ చేస్తే తన భార్య అనన్య (మాళవిక నాయర్), ఓ కొడుకుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు విక్కీ. ఓ గో కార్టింగ్ రేస్ ట్రాక్ నడుపుతుంటాడు. అయితే తన తండ్రికి జరిగిన అవమానం గురించి తెలిసి విక్కీ మళ్లీ రేసింగ్ స్టార్ట్ చేస్తాడు. అసలు విక్కీ రేసింగ్ ను ఎందుకు వదిలేశాడు? మళ్లీ ఎందుకు స్టార్ట్ చేశాడు? ఇందులో అనన్యతో లవ్ స్టోరీ ఏంటీ? అన్నది తెలియాలంటే 'బైకర్' మూవీ చూడాల్సిందే.
Chandu Shanigarapu

