రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. వీటి ప్రకారం ఏ రాశి వారు ఏ విధంగా ఉంటారనేది తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి తీరు, ప్రవర్తన మరొకరితో పోల్చుకుంటే కాస్త భిన్నంగానే ఉంటుంది.
అలాగే ప్రతి ఒక్కరికీ కూడా ఒక ఇన్నర్ వాయిస్ అనేది ఉంటుంది.
జ్యోతిష్య ప్రకారం కొన్ని రాశుల వారికి అంతర్దృష్టి శక్తి అద్భుతంగా ఉంటుంది. జరగబోయే సంఘటనలను వారు ముందే పసిగట్టగలరు. వారి చుట్టూ ఉన్న వాళ్ల నిజ స్వభావాలను కూడా కొన్ని రాశుల వారు సులువుగా అర్థం చేసుకుంటారు. మంచివారు ఎవరు, వారి వెనుక వెన్నుపోటు ఎవరు పొడుస్తున్నారు వంటి విషయాలను కూడా జాగ్రత్తగా అంచనా వేయగలరు. వీరి దగ్గర అబద్ధం చెప్పడం కూడా సాధ్యం కాని పని. క్షణాల్లో అబద్ధాలను, అబద్ధం చెప్పే వారిని, మోసం చేసే వారిని గుర్తించగలరు. పైగా ఈ రాశుల వారికి సిక్స్త్ సెన్స్ చాలా ఎక్కువ. ఏ విషయమైనా ముందే తెలిసిపోతుంది. మరి వారు ఎవరు? వారిలో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈ రాశుల వారికి ఎందుకు సిక్స్త్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది?
ఈ మూడు రాశుల వారు సిక్స్త్ సెన్స్‌ను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశులు జల రాశులు. జలతత్వం సున్నితత్వం, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకనే ఈ రాశుల వాళ్లు సూక్ష్మమైన సంకేతాలను ఈజీగా గ్రహిస్తారు. ఇతరుల కంటే కూడా భవిష్యత్తు గురించి ముందుగానే అంచనా వేయగలరు.
1.కర్కాటక రాశి
కర్కాటక రాశికి చంద్రుడితో సంబంధం ఉంది. ఈ రాశి వారు చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పులను కూడా సులువుగా గ్రహించగలరు. ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అంచనా వేస్తారు. ప్రవర్తనలో మార్పు అయినా, రాబోయే ముఖ్యమైన విషయమైనా ముందే పసిగట్టగలరు. సిక్స్త్ సెన్స్ ఈ రాశి వారికి విపరీతంగా ఉంటుంది.
2.వృశ్చిక రాశి
ఈ రాశి వారికి కూడా సిక్స్త్ సెన్స్ ఎక్కువ. అత్యంత రహస్యమైన రాశుల్లో ఈ రాశి ఒకటి. ఈ రాశి వారు లోతైన ఆలోచనాపరులు. ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకునే అద్భుతమైన కళ ఈ రాశి వారికి ఉంది. సిక్స్త్ సెన్స్ ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు వీళ్లు ఆధారం లేకుండానే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ నిర్ణయం సరైనదని నిరూపితమవుతుంది.
3.మీన రాశి
మీన రాశి వారికి కూడా సిక్స్త్ సెన్స్ ఎక్కువ. ఈ రాశికి అధిపతి గురుగ్రహం. జలతత్వానికి చెందిన రాశి ఇది. ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. ఊహాశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా అనుకుంటే అది చాలా వరకు నిజమవుతుంది. మనసులో వీరికి వచ్చే ఆలోచనలు లేదా కలలు ఇంచుమించుగా నిజమవుతాయి. ఇతరుల ఆలోచనలను, భావాలను వీరు ఈజీగా చదివేస్తారు. వీరి ముందు అబద్ధాలు చెప్పడం ఏమాత్రం పనిచేయదు.
Peddinti Sravya, hyderabad

