ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని స్కోడా తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఎపిక్'ని సిద్ధం చేస్తోంది.
వచ్చే ఏడాది నాటికి తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ కారును కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మే 19, 2026న జ్యూరిచ్ వేదికగా దీనిని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మురిపించే ఇంటీరియర్.. 'మోడరన్ సాలిడ్' డిజైన్:
స్కోడా విడుదల చేసిన ఇంటీరియర్ స్కెచ్‌లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ స్కోడా ఎపిక్ ఎలక్ట్రిక్ కారు 'మోడరన్ సాలిడ్' అనే సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో రూపొందింది. ఇది కారు లోపలి భాగాన్ని చాలా సింపుల్‌గా, విశాలంగా కనిపించేలా చేస్తుంది.
డ్యాష్‌బోర్డ్: పాతకాలపు డ్యాష్‌బోర్డ్ సెటప్‌కు భిన్నంగా, ఇందులో సమాంతర లేఅవుట్‌ను ఉపయోగించారు. దీనివల్ల కారు లోపల ఎక్కువ స్థలం ఉన్నట్లు అనిపిస్తుంది.
లైటింగ్: కారులో ప్రయాణించే వారికి ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవ్వడానికి 'యాంబియంట్ లైటింగ్'ను అమర్చారు. కారులోని ఫంక్షన్‌లను సులభంగా ఆపరేట్ చేసేలా నియంత్రణ బటన్లను డిజైన్ చేశారు.
స్కోడా ఎపిక్ ఈవీ- ప్రాక్టికల్ ఫీచర్లు..
ఒక ఫ్యామిలీ ఎస్‌యూవీకి ఉండాల్సిన అన్ని హంగులను స్కోడా ఇందులో పొందుపరిచింది.
సెంటర్ కన్సోల్‌లో స్మార్ట్‌ఫోన్ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
స్టోరేజ్ కోసం ఎక్కువ ఖాళీ స్థలాన్ని కేటాయించారు.
పర్యావరణ హితం కోసం ఈ కారు ఇంటీరియర్‌లో 'సస్టైనబుల్ మెటీరియల్స్' వాడటం విశేషం.
స్కోడా ఎపిక్ ఈవీ- మార్కెట్లో దీని స్థానం ఏంటి?
స్కోడా ఎపిక్ ఒక ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. అంటే ఇది తక్కువ ధరలో ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా రానుంది. యూరప్‌లోని అర్బన్ కార్ ఫ్యామిలీలో భాగంగా వోక్స్‌వ్యాగన్ గ్రూప్ దీనిని అభివృద్ధి చేస్తోంది. 2026 నాటికి స్కోడా తన ఎలక్ట్రిక్ శ్రేణిని విస్తరించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషించనుంది.
తక్కువ ధర, అత్యాధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో రానున్న ఈ కారు ఎలక్ట్రిక్ వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకోనుంది.
స్కోడా ఎపిక్ ఈవీ ఇండియా లాంచ్, ధర, రేంజ్ సహా ఇతర వివరాలపై సంస్థ స్పందించాల్సి ఉంటుంది.
Chitturi Eswara Karthikeya Sharath

