Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Spider Man: అవతార్ 2 రికార్డు బ్రేక్.. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే

Spider Man: అవతార్ 2 రికార్డు బ్రేక్.. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే

Spider Man: హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ (Tom Holland) రేంజ్ దెబ్బకు మరో మైండ్ బ్లోయింగ్ రికార్డ్ బ్రేక్ అయింది. మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో వండర్ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) వరల్డ్ వైడ్‌గా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది.

కేవలం ఐదు వారాల్లోనే 2.335 బిలియన్ డాలర్లు (సుమారు రూ.21,200 కోట్లు) వసూలు చేసి ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్లలో మూడో స్థానానికి చేరింది.

జేమ్స్ కేమkeన్ బ్లాక్‌బస్టర్స్‌కే షాక్

ఇప్పటివరకు ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఆల్‌టైమ్ టాప్ వసూళ్లు సాధించిన జేమ్స్ కేమరాన్ ఎపిక్స్ 'టైటానిక్' ($2.257 బిలియన్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ($2.332 బిలియన్లు) చిత్రాలను స్పైడర్ మ్యాన్ దాటేసింది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది.

ఏకైక సోలో సూపర్ హీరో సినిమాగా $2.33 బిలియన్ల మైలురాయిని చేరుకోవడం హాలీవుడ్ హిస్టరీలోనే మొదటిసారి కావడం విశేషం. కేవలం ఐదు వారాల్లోనే ఈ రికార్డు సాధించడంతో మార్వెల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే - బాక్సాఫీస్ రిపోర్ట్ కార్డ్ (2026)

• గ్లోబల్ కలెక్షన్లు: $2.335 బిలియన్లు (సుమారు రూ. 21,200+ కోట్లు)

• నార్త్ అమెరికా (డొమెస్టిక్): $891 మిలియన్లు (అవెంజర్స్ ఎండ్‌గేమ్‌ కంటే ఎక్కువ)

• ఓవర్సీస్ వసూళ్లు: $1.44 బిలియన్లు

• ఆల్‌టైమ్ గ్లోబల్ ర్యాంక్: 3వ స్థానం (అవతార్ 2, టైటానిక్ ఔట్)

• లీడ్ క్యాస్ట్: టామ్ హాలండ్, జెండయా, జేకబ్ బాటలాన్, సాడీ సింక్, మార్క్ రుఫాలో

• డైరెక్టర్: డెస్టిన్ డానియల్ క్రెటన్ (Destin Daniel Cretton)

అమెరికాలో 'ఎండ్‌గేమ్', 'అవతార్' రికార్డులు క్రాష్

నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చూపించిన ప్రభావం మామూలుగా లేదు. యుఎస్, కెనడా ప్రాంతాల్లో $891 మిలియన్లు రాబట్టి డొమెస్టిక్ మార్కెట్‌లో ఎవర్ గ్రీన్ మైలురాయిని నమోదు చేసింది. ఈ క్రమంలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ($858 మిలియన్లు), 'అవతార్ 1' ($749 మిలియన్లు) డొమెస్టిక్ కలెక్షన్లను కూడా దాటేసింది.

ప్రస్తుతం డొమెస్టిక్ మార్కెట్‌లో 2015లో వచ్చిన 'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్' ($936 మిలియన్లు) తర్వాత ఆల్ టైమ్ సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా స్పైడర్ మ్యాన్ నిలిచింది. ఓవర్సీస్ మార్కెట్లలో చైనా, జపాన్, యూకే తో పాటు ఇండియాలో కూడా ఈ మూవీ ఊహించని రీతిలో వసూళ్లు సాధించింది.

పీటర్ పార్కర్ కొత్త ప్రయాణం.. డిఫరెంట్ ఎమోషన్స్

'నో వే హోమ్' ఈవెంట్స్ తర్వాత లోకానికి పీటర్ పార్కర్ అనే వ్యక్తి పూర్తిగా మరచిపోయిన నేపథ్యంలో ఈ 'బ్రాండ్ న్యూ డే' కథ సాగుతుంది. పాత స్నేహితులు, ప్రేమను వదులుకుని ఒంటరిగా జీవిస్తున్న పీటర్.. స్పైడర్ మ్యాన్‌గా కొత్త విలన్ల నుంచి నగరాన్ని ఎలా కాపాడుకున్నాడనే పాయింట్‌ను ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు.

'షాంగ్-చి' ఫేమ్ డెస్టిన్ డానియల్ క్రెటన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టామ్ హాలండ్, జెండయా, జేకబ్ బాటలాన్‌తో పాటు సాడీ సింక్, మార్క్ రుఫాలో (హల్క్), జాన్ బెర్న్‌తల్ (పనిషర్) కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

టాప్ 2 స్థానాల్లో ఏ సినిమాలు ఉన్నాయి?

ప్రస్తుతం ఆల్‌టైమ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ చార్ట్‌లో 'అవతార్ 1' ($2.923 బిలియన్లు) మొదటి స్థానంలో ఉండగా, 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ($2.797 బిలియన్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. స్పైడర్ మ్యాన్ లాంగ్ రన్ ముగిసే సమయానికి దాదాపు $2.35 బిలియన్ల వద్ద క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వరల్డ్ వైడ్‌గా సోలో హీరో ఫ్రాంచైజీకి ఉన్న పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో ఈ రికార్డ్ ఒక బెంచ్ మార్క్‌గా నిలిచిపోతుంది

.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu