Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Spider Man Bonalu: తెలంగాణలో స్పైడర్ మ్యాన్‌కు బోనాల పూనకాలు.. తెలుగు రాష్ట్రాల్లో స్పైడీ మాస్ జాతర.. వీడియోలు వైరల్

Spider Man Bonalu: తెలంగాణలో స్పైడర్ మ్యాన్‌కు బోనాల పూనకాలు.. తెలుగు రాష్ట్రాల్లో స్పైడీ మాస్ జాతర.. వీడియోలు వైరల్

Spider Man Bonalu: మన టాలీవుడ్ మాస్ హీరోల సినిమాలు రిలీజైతే థియేటర్లలో పూనకాలు వచ్చినట్లే, హాలీవుడ్ యంగ్ స్టార్ టామ్ హాలండ్ (Tom Holland) నటించిన 'స్పైడర్ మాన్: బ్రాండ్ న్యూ డే' సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు పిచ్చెక్కిపోయే రేంజ్‌లో రచ్చ చేశారు.

ఆంధ్రా, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లలో పేపర్ ముక్కలు ఎగరేస్తూ, విజిల్స్‌తో థియేటర్లను హోరెత్తిస్తూ స్పైడర్‌మ్యాన్‌ను మన పక్కా లోకల్ మాస్ హీరోగా మార్చేశారు.

టాలీవుడ్ బడా స్టార్లు ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ తదుపరి సినిమాల కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటుండటంతో, థియేటర్లలో మాస్ ఫన్‌కి దూరమైన తెలుగు ఆడియన్స్ స్పైడీనే తమ ఓన్ మాస్ హీరోగా ఫిక్స్ అయిపోయారు.

మహేష్ బాబు స్టైల్‌లో 'సూపర్‌స్టార్ టామ్ హాలండ్'..

సాధారణంగా మన పెద్ద హీరోల సినిమాల్లో పేరు పడే ముందు విజువల్ ఎఫెక్ట్స్‌తో పవర్ ఫుల్ టైటిల్ కార్డ్స్ పడటం చూస్తూనే ఉంటాం. సరిగ్గా అదే స్టైల్‌లో స్పైడర్ మ్యాన్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్యాన్స్ ఓ క్రేజీ ఎడిట్ టైటిల్ కార్డ్‌ను స్క్రీన్ పై ప్లే చేశారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫాంట్‌ను కాపీ చేస్తూ "సూపర్‌స్టార్ టామ్ హాలండ్.. యూత్ స్టార్ పీటర్ పార్కర్.. స్పైడీ" అంటూ టైటిల్ పడగానే థియేటర్లలో ఫ్యాన్స్ కొట్టిన విజిల్స్, విసిరిన కాగితాల గోలలో హాల్ అంతా దద్దరిల్లిపోయింది.

బోనాల పండుగ వైబ్స్.. స్పైడీ సూట్‌లో 'పెద్ద పులి' డాన్స్

తెలంగాణలో జులై 16 నుంచి ఆగస్టు 10 వరకు అత్యంత వైభవంగా జరిగే బోనాల పండుగ వాతావరణం ఈ సినిమా రిలీజ్‌తో మరింత హీటెక్కింది. మైసమ్మ తల్లిని కొలుస్తూ పాడే ఫేమస్ 'పెద్ద పులి' పాటను పాత స్పైడర్‌మ్యాన్ క్లిప్పింగ్స్‌కి సింక్ చేస్తూ ఫ్యాన్స్ చేసిన మాషప్ ఎడిట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.

అంతటితో ఆగకుండా థియేటర్ లోపల కొందరు యువకులు స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్స్ వేసుకుని బిగ్ స్క్రీన్ ముందే 'పెద్ద పులి' డాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఆడియన్స్ కూడా వారితో కలిసి స్టెప్పులేయడంతో సింగిల్ స్క్రీన్స్ కాస్తా జాతర ప్రాంగణాల్లా మారిపోయాయి.

'స్పైడీ దేవరత రైసార్'.. ప్రభాస్ సలార్ రేంజ్ కటౌట్

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'సలార్' సినిమాలో 'దేవరత రైసార్' ఎలివేషన్ సీన్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పైడర్‌మ్యాన్ సినిమాలోని యాక్షన్ సీన్లను సలార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మిక్స్ చేసి 'స్పైడీ దేవరత రైసార్' అంటూ ప్లే చేసినప్పుడు థియేటర్లలో రెస్పాన్స్ చూసి హాలీవుడ్ వర్గాలు కూడా షాక్ అవ్వాల్సిందే.

సినిమా హాల్ మేనేజ్‌మెంట్స్ కూడా ఈ రచ్చకు సహకరిస్తూ, ఫ్యాన్ ఎడిట్స్ ప్లే అవుతున్న సమయంలో పాటలకు తగ్గట్టు థియేటర్ లైటింగ్ సింక్ చేసి ఆడియన్స్‌కు విజువల్ ట్రీట్ ఇచ్చాయి.

కలెక్షన్ల సునామీ.. జులై 31న వచ్చి బాక్సాఫీస్ షేక్

జులై 31, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన 'స్పైడర్ మాన్: బ్రాండ్ న్యూ డే' పాజిటివ్ రివ్యూలతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్‌లో టామ్ హాలండ్, జెండయా, సేడీ సింక్, జేకాబ్ బాటలాన్, ఫ్లోరెన్స్ ప్యూ, మార్క్ రుఫాలో కీలక పాత్రల్లో అదరగొట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ సాధించడం వెనుక మన తెలుగు ఆడియన్స్ చూపించిన ఈ అనూహ్యమైన మాస్ అభిమానమే ప్రధాన కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu