Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Spider Man Leak: ఆరు రోజుల్లోనే బిలియన్ డాలర్ల వసూళ్ల స్పైడర్ మ్యాన్.. ఆన్‌లైన్‌లో లీక్.. నెటిజన్ల రియాక్షన్ ఇలా

Spider Man Leak: ఆరు రోజుల్లోనే బిలియన్ డాలర్ల వసూళ్ల స్పైడర్ మ్యాన్.. ఆన్‌లైన్‌లో లీక్.. నెటిజన్ల రియాక్షన్ ఇలా

Spider Man Leak: ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తున్న 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) చిత్రానికి పెద్ద షాక్ తగిలింది.

బాక్సాఫీస్ దగ్గర కేవలం 6 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,500 కోట్లకు పైగా) మార్కును దాటేసిన ఈ మార్వెల్ బ్లాక్‌బస్టర్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. పైరసీ కాపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మార్వెల్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

4 గంటల్లో 8 లక్షల వ్యూస్.. లీక్ చేసిన వ్యక్తిపై ఫైర్

ఈ పైరసీ వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ కావడమే కాకుండా కేవలం 4 గంటల్లోనే దాదాపు 8 లక్షల వ్యూస్ దక్కించుకుంది. అయితే పైరసీని ప్రోత్సహించే వారిపై సాధారణ నెటిజన్లు, స్పైడర్‌మ్యాన్ డైహార్డ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

"ఇది కాపీరైట్ చట్టాల ఉల్లంఘన.. లీక్ చేసిన వారిపై కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన బిగ్ స్క్రీన్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇలాంటి లో-క్వాలిటీ ఫోన్ వీడియోల్లో చూసి వేస్ట్ చేసుకోవద్దని కోరుతున్నారు.

లీక్ అయిన వీడియోలో షాకింగ్ ట్విస్ట్

ఇక లీక్ అయిన వీడియో నిడివిని గమనిస్తే అది కేవలం 2 గంటల 16 నిమిషాలు మాత్రమే ఉంది. కానీ ఒరిజినల్ 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమా థియేట్రికల్ రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలు కావడం విశేషం.

దీంతో లీక్ అయిన వీడియో అసలైన కంప్లీట్ మూవీ కాదని, చాలా ముఖ్యమైన సీన్లు కట్ అయిన ఎడిటెడ్ వర్షన్ అని నెటిజన్లు క్లారిటీ ఇస్తున్నారు. లీక్ చేసిన వ్యక్తి సగం సగం ఫుటేజ్‌తో హల్‌చల్ చేస్తున్నాడని మార్వెల్ లవర్స్ చెబుతున్నారు.

'అవెంజర్స్ ఎండ్‌గేమ్' రికార్డులపై దాడి

లీక్ వివాదం పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేస్తున్న సునామీ మామూలుగా లేదు. కేవలం 6 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల బెంచ్‌మార్క్ క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు హిస్టరీలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (5 రోజుల్లో 1 బిలియన్ డాలర్లు) మాత్రమే దీనికంటే వేగంగా ఈ మార్కును అందుకుంది.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ ఏకంగా 360 మిలియన్ డాలర్లు వసూలు చేసి 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' (357.1 మిలియన్ డాలర్లు) ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. సోమవారం నాటి కలెక్షన్లలో 46 మిలియన్ డాలర్లు సాధించి 'బ్లాక్ పాంథర్' రికార్డును కూడా తుడిచిపెట్టేసింది.

ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.360 కోట్ల గ్రాస్ విధ్వంసం

ఇండియన్ మార్కెట్‌లో కూడా టామ్ హాలాండ్ (Tom Holland), జెండాయా (Zendaya) క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో పనిచేసింది. ఇండియాలో తొలిరోజే గురువారం నాడు రూ.60.60 కోట్ల భారీ నెట్ కలెక్షన్‌తో ఖాతా తెరిచింది.

శుక్రవారం రూ.49.35 కోట్లు, శనివారం రూ.70.25 కోట్లు, ఆదివారం రూ.77.75 కోట్ల వసూళ్లతో వీకెండ్‌లో సునామీ సృష్టించింది. సోమ, మంగళవారాల్లో కూడా స్థిరంగా రూ.23.80 కోట్లు, రూ.21.50 కోట్లు రాబట్టింది. మొత్తంగా 6 రోజుల్లో ఇండియాలో రూ.303.25 కోట్ల నెట్ (రూ.362.61 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu