Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srinivasa Mangapuram OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన శ్రీనివాస మంగాపురం.. మహేష్ బాబు అన్న కొడుకు సినిమాను ఎక్కడ చూడాలంటే?

Srinivasa Mangapuram OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన శ్రీనివాస మంగాపురం.. మహేష్ బాబు అన్న కొడుకు సినిమాను ఎక్కడ చూడాలంటే?

Srinivasa Mangapuram OTT: తెలుగు చిత్రసీమలోకి మరో నయా వారసుడు ఎంట్రీ ఇచ్చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram).

నిన్న (జూలై 30) రిలీజైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ నెలకొంది.

శ్రీనివాస మంగాపురం ఓటీటీ

మహేష్ బాబు అన్న కొడుకు సినిమా అనగానే శ్రీనివాస మంగాపురంపై మంచి హైప్ నెలకొంది. అంచనాలను అందుకుంటూ గురువారం థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' చిత్రాలతో రా అండ్ రస్టిక్ కథలను తెరకెక్కించి మెప్పించిన అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రాబోతుంది.

స్ట్రీమింగ్ ఎప్పుడు?

శ్రీనివాస మంగాపురం సినిమాతో జయకృష్ణ ఘట్టమనేనితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) కూడా టాలీవుడ్‌కి పరిచయమైంది. రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రైమ్ వీడియో దక్కించుకుంది. సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ రిలీజ్ కానుంది.

సాధారణంగా నాలుగు వారాల తర్వాత శ్రీనివాస మంగాపురం ఓటీటీ డెబ్యూ చేయనుంది. అంటే ఆగస్టు 28న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఓటీటీ పార్ట్‌నర్ లాక్

శ్రీనివాస మంగాపురం సినిమా థియేటర్లలో విడుదలై ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణంలోనే, మేకర్స్ ఈ చిత్ర ఓటీటీ డిజిటల్ పార్ట్‌నర్ వివరాలను అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీకి ఓటీటీ పార్ట్ నర్. 'చందమామ కథలు' పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్‌ఫుల్ నెగెటివ్ పాత్రలో నటించగా.. శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ విజయకృష్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ అండ్ రివేంజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

యాక్షన్ ఎపిసోడ్స్

ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విశ్లేషణ ప్రకారం.. ఘట్టమనేని కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడంతో జయకృష్ణ ఎంట్రీపై ఆరంభం నుంచే మార్కెట్‌లో మంచి హైప్ నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన అన్న కొడుకుకు అభినందనలు తెలియజేయడం ఘట్టమనేని అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.

కష్టమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుని ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టిన జయకృష్ణ, తన మొదటి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యాన్సులలో చూపించిన ఆత్మవిశ్వాసానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.

తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ రస్టిక్ ప్రేమకథ ముఖ్యంగా 'బి', 'సి' సెంటర్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి గ్లోబల్ దిగ్గజం డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోవడం వల్ల నిర్మాతలకు ప్రీ-రిలీజ్ టేబుల్ ప్రాఫిట్స్ సమకూరినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu