మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 510 పాయింట్లు పెరిగి 74,617 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 155 పాయింట్లు వృద్ధిచెంది 23,124 వద్ద సెషన్‌ని ముగించింది.
ఇక బ్యాంక్ నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 52,716 వద్దకు చేరింది.
ఇరాన్‌తో యుద్ధాన్ని రెండు వారాలు నిలిపివేస్తూ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఫలితంగా, ముడి చమురు ధరలు అతి భారీగా పడ్డాయి. అదే సమయంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,692.11 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,979.50 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ అతి భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 680 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.18 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.08శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.10 శాతం పెరిగింది.
కాగా ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటనతో అమెరికా ఫ్యూచర్స్ సైతం భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి.
ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ చేసిన ప్రకటనను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక తాజా పరిణామాల మధ్య ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. జపాన్ నిక్కీ 4.5శాతం, సౌత్ కొరియా కాస్పీ 5.3శాతం జంప్ అయ్యాయి.
ముడి చమురు ధరలు..
అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణతో పాటు హర్ముజ్ జలసంధి రీఓపెన్ నేపథ్యంలో ముడి చమురు ధరలు అతి భారీగా పడ్డాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 13.86శాతం పడి బ్యారెల్‌కు 94.13 డాలర్లకు చేరింది. ఒకానొక సమయంలో బ్రెంట్ క్రూడ్ 15శాతం వరకు కూడా ఫాల్ అయ్యింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్- బై రూ. 285, స్టాప్ లాస్ రూ. 273, టార్గెట్ రూ. 300
డేటా పాటర్న్స్ ఇండియా- బై రూ. 3209, స్టాప్ లాస్ రూ. 2088, టార్గెట్ రూ. 2400
వెల్స్పన్ కార్ప్- బై రూ. 879, స్టాప్ లాస్ రూ. 837, టార్గెట్ రూ. 940
శార్దా ఎనర్జీ అండ్ మినరల్స్- బై రూ. 528, స్టాప్ లాస్ రూ. 505, టార్గెట్ రూ. 565
డీఈఎఫ్ డెవలప్మెంట్ ఇంజినీర్స్- బై రూ. 313, స్టాప్ లాస్ రూ. 29, టార్గెట్ రూ. 335
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
Chitturi Eswara Karthikeya Sharath

