Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Stock market : ట్రేడర్స్​ అలర్ట్- ఈ 10 స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్!

Stock market : ట్రేడర్స్​ అలర్ట్- ఈ 10 స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్!

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 444 పాయింట్లు పెరిగి 76,923 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు వృద్ధిచెంది 24,006 వద్ద సెషన్​ని ముగించింది.

ఇక బ్యాంక్​ నిఫ్టీ 490 పాయింట్లు పెరిగి 58,033 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,140.50 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,159.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.03 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.22శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.66 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

బ్రెంట్​ క్రూడ్​ ధర బ్యారెల్​కి 72 డాలర్ల దిగువన ట్రేడ్​ అవుతోంది.

స్టాక్స్​ టు బై..

మిండా కార్పొరేషన్- బై రూ. 709, స్టాప్​ లాస్​ రూ. 685, టార్గెట్​ రూ. 755

హొనాసా కన్జ్యూమర్- బై రూ. 466, స్టాప్​ లాస్​ రూ. 450, టార్గెట్​ రూ. 498

బజాజా ఆటో- బై రూ. 9842, స్టాప్​ లాస్​ రూ. 9700, టార్గెట్​ రూ .10250

బీఈఎల్- బై రూ .416, స్టాప్​ లాస్​ రూ. 408, టార్గెట్​ రూ .428

ఎస్బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్- బై రూ. 1790, స్టాప్​ లాస్​ రూ. 1680, టార్గెట్​ రూ. 1850

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

అదానీ ఎంటర్​ప్రైజెస్- బై రూ. 3144, స్టాప్​ లాస్​ రూ. 3000, టార్గెట్​ రూ .3425

జీఎంఆర్​ ఎయిర్​పోర్ట్స్- బై రూ. 113.50, స్టాప్​ లాస్​ రూ. 108, టార్గెట్​ రూ. 124

కిమ్స్- బై రూ. 831, స్టాప్​ లాస్​ రూ. 790, టార్గెట్​ రూ. 907

సీయెట్ లిమిటెడ్- బై రూ. 3635, స్టాప్​ లాస్​ రూ. 3450, టార్గెట్​ రూ. 4000

ఏసీఎంఈ సొలార్ హోల్డింగ్స్- బై రూ. 391, స్టాప్​ లాస్​ రూ. 370, టార్గెట్​ రూ. 430

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu