Dailyhunt
Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 126 స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 126 స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 356 పాయింట్లు పెరిగి 77,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 122 పాయింట్లు వృద్ధిచెంది 24,119 వద్ద సెషన్​ని ముగించింది.

ఇక బ్యాంక్​ నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 54,878 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,835.62 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,764.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 డైలీ చార్ట్​లో పెద్ద అప్పర్​ షాడోతో కూడిన స్మాల్​ బుల్లిష్​ క్యాండిల్​ ఏర్పడింది. టెక్నికల్​గా చూసుకుంటే సూచీ 23,800- 24,300 లెవల్స్​ మధ్యలో ఊగిసలాడుతోంది. సోమవారం కూడా 24,300 రెసిస్టెన్స్​ దగ్గరిలో నుంచి పడింది. ఆ రెసిస్టెన్స్​ బ్రేక్​ అయితే సూచీ 24,600- 24,800 లెవల్స్​ వరకు వెళ్లొచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.13 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.41శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.19 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్​ ఆయిల్​ 110 డాలర్ల పైనే ట్రేడ్​ అవుతోంది. ప్రస్తుతం 0.6శాతం పడి బ్యారెల్​కు 113.76 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

విషాల్ మెగా మార్ట్- బై రూ. 126, స్టాప్​ లాస్​ రూ. 123, టార్గెట్​ రూ. 132

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 252, స్టాప్​ లాస్​ రూ. 248, టార్గెట్​ రూ. 260

బెల్​రైస్​ ఇండస్ట్రీస్- బై రూ. 215, స్టాప్​ లాస్​ రూ. 212, టార్గెట్​ రూ. 220

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

చోలమండలం ఇన్వెస్ట్​మెంట్ అండ్​ ఫిన్​ కో- బై రూ. 1770, స్టాప్​ లాస్​ రూ. 1564, టార్గెట్​ రూ. 1770

నెస్కో- బై రూ. 1285, స్టాప్​ లాస్​ రూ. 1230, టార్గెట్​ రూ. 1400

శివాలిక్ బైమెటల్​ కంట్రోల్స్- బై రూ. 625, స్టాప్​ లాస్​ రూ. 595, టార్గెట్​ రూ. 675

షిప్పింగా కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 318.5, స్టాప్​ లాస్​ రూ. 301, టార్గెట్​ రూ. 340

జనరల్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా- బై రూ. 409.3, స్టాప్​ లాస్​ రూ. 393, టార్గెట్​ రూ. 440

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu