Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Stocks to buy : ట్రేడర్స్​ అలర్ట్- ఈ రూ. 218 బ్రేకౌట్ స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

Stocks to buy : ట్రేడర్స్​ అలర్ట్- ఈ రూ. 218 బ్రేకౌట్ స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 183 పాయింట్లు పడి 77,473 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 127 పాయింట్లు కోల్పోయి 24,208 వద్ద సెషన్​ని ముగించింది.

ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 267 పాయింట్లు పెరిగి 57,784 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 502.63 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,425.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,115 సపోర్ట్​ లెవెల్​గా ఉండనుంది. ఇది బుధవారం నాటి ఇంట్రాడే లో. దీని కన్నా దిగువకు పడితే సూచీ 24,000- 24,040 వరకు వెళ్లొచ్చు. ఇక 24,400 వద్ద నిఫ్టీ50కి కీలక రెసిస్టెన్స్ ఉంది," అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.23 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.02శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.08 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

గురువారం ట్రేడింగ్ సెషన్​లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.6శాతం పడి బ్యారెల్​కు 87.2 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

రస్సెల్ టెక్​సిస్- బై రూ. 1100, స్టాప్ లాస్ రూ. 1048, టార్గెట్​ రూ. 1190

యథార్త్ హాస్పిటల్ అండ్ ట్రౌమా కేర్ సర్వీసెస్- బై రూ. 965, స్టాప్​ లాస్​ రూ. 910, టార్గెట్​ రూ. 1050

ఇండిగో పెయింట్స్- బై రూ. 1186, స్టాప్​ లాస్​ రూ. 1125, టార్గెట్​ రూ. 1280

లుమాక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 6160, స్టాప్​ లాస్​ రూ. 5785, టార్గెట్​ రూ. 6700

క్రాస్- బై రూ. 218, స్టాప్​ లాస్​ రూ. 205, టార్గెట్​ రూ. 235

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu