Dailyhunt
Sun Transit: అలర్ట్! సూర్యుడు తన శత్రు రాశిలోకి.. ఈ రాశుల వారికి అగ్నిపరీక్షే, మీ రాశి ఉందో చూసుకోండి!

Sun Transit: అలర్ట్! సూర్యుడు తన శత్రు రాశిలోకి.. ఈ రాశుల వారికి అగ్నిపరీక్షే, మీ రాశి ఉందో చూసుకోండి!

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. సూర్యుడు ప్రతినెల తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. సూర్య సంచారంలో మార్పు వస్తే అది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది.

మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి అడుగు పెడతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

జ్యోతిష లెక్కల ప్రకారం చూసినట్లయితే, మే 15న తన శత్రు రాశి అయిన వృషభ రాశిలోకి సూర్యుడు అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మరి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఎవరికీ ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులకు సమస్యలు

1.వృషభ రాశి:

ఈ రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు పనిలో అడ్డంకులను ఎదుర్కొంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కోపం పెరుగుతుంది, ఇరిటేషన్ కలుగుతుంది. అంతేకాకుండా తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.

2.తులా రాశి:

తులా రాశి వారికి ఈ సమయం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు సమస్యలతో సతమతం అవ్వాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి రాకపోవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. రిలేషన్‌షిప్‌లో టెన్షన్లు పెరగవచ్చు. కుటుంబ జీవితంలో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండాలి.

3.మకర రాశి:

ఈ రాశి వారికి కూడా సూర్య రాశి మార్పుతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సూర్య సంచారంలో మార్పు కెరీర్‌లో ఇబ్బందులను తీసుకువస్తుంది. సడన్‌గా ట్రాన్స్‌ఫర్లు అయ్యే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. గుడ్డిగా తోటి ఉద్యోగస్తులను నమ్మకండి, మోసాలు జరగవచ్చు.

4.కుంభ రాశి:

కుంభ రాశి వారికి కూడా సూర్య సంచారంలో మార్పు ఇబ్బందులను కలిగించవచ్చు. వ్యాపారంలో లాభాలు తగ్గవచ్చు. ముఖ్యమైన ప్రాజెక్టులు లేదా డీల్స్ కుదుర్చుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి. తల్లి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

Peddinti Sravya, hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu