Dailyhunt
Sunny Leone OTT Series: ఓటీటీ సిరీస్‌తో రానున్న సన్నీ లియోన్- అరగంట రన్‌టైమ్, 6 ఎపిసోడ్స్- స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

Sunny Leone OTT Series: ఓటీటీ సిరీస్‌తో రానున్న సన్నీ లియోన్- అరగంట రన్‌టైమ్, 6 ఎపిసోడ్స్- స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో నటి సన్నీ లియోన్ దూసుకుపోతోంది. తాజాగా సన్నీ లియోన్ ఒక భారీ అమెరికన్ ఓటీటీ సిరీస్‌లో నటించే అవకాశం దక్కించుకుంది.

'ది జెయింట్' (The Giant) పేరుతో తెరకెక్కనున్న ఈ ఓటీటీ సిరీస్‌లో సన్నీ లియోన్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా, దీనిపై సన్నీ స్వయంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సరికొత్త పాత్రలో సన్నీ..

ఈ ప్రాజెక్టు గురించి వెరైటీ ఇండియా ప్రతినిధితో సన్నీ లియోన్ ప్రత్యేకంగా మాట్లాడారు. "నేను ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ నన్ను బాగా ఆకర్షించింది. పూర్తిగా కొత్త వాతావరణంలో, ఒక కొత్త క్యారెక్టర్‌ను అన్వేషించడం ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ ప్రయాణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను ఎంత ఇష్టపడి ఇందులో భాగమయ్యానో, నా అభిమానులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" అని సన్నీ లియోన్ పేర్కొన్నారు.

ఓటీటీ సిరీస్ విశేషాలేంటి?

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ది జెయిట్ ఓటీటీ సిరీస్ అరగంట నిడివి గల ఎపిసోడ్ల ఫార్మాట్‌లో రానుంది. ప్రతి సీజన్‌లో ఆరు ఎపిసోడ్లు ఉండేలా ప్లాన్ చేశారు. అమెరికన్ ఓటీటీ స్ట్రీమింగ్ మార్కెట్‌లో ప్రస్తుతం ట్రెండ్‌గా ఉన్న 'క్యారెక్టర్ డ్రివెన్' (పాత్రల చుట్టూ తిరిగే కథ) శైలిలో ఈ ఓటీటీ సిరీస్ ఉండనుంది.

హాలీవుడ్ నటుడు కెవిన్ బి ప్లాత్ ఈ సిరీస్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్, ఆసియా మూలాలున్న నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. వివిధ సంస్కృతులకు చెందిన నటులు ఇందులో భాగం కావడం విశేషం. షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సిరీస్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విడుదల చేయనున్నారు.

సన్నీ చేతిలో మరిన్ని ప్రాజెక్టులు..

ఇదిలా ఉంటే, సన్నీ లియోన్ గతంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'కెన్నెడీ' చిత్రంతో పాటు తెలుగు ప్రాజెక్ట్ 'త్రిముఖ'లో కూడా నటించారు. ప్రస్తుతం సన్నీ లియోన్ చేతిలో 'రంగీలా', 'షీరో', 'హెలెన్','ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్' వంటి ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి.

తెలుగులో కూడా

బాలీవుడ్ టు హాలీవుడ్ వరకు ఎదిగిన సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. అడల్ట్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సన్నీ బాలీవుడ్‌కు చేరి మంచి క్రేజ్ తెచ్చుకుంది. జిస్మ్, రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2, జాక్‌పాట్, హేట్ స్టోరీ 2 వంటి సినిమాలతో అలరించింది. అలాగే, చాలా వరకు ఐటమ్ సాంగ్స్‌తో కూడా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్‌తోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లోనూ సన్నీ లియోన్ సినిమాలు చేసింది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu