సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. సూర్యుడు ప్రతీ నెలా కూడా తన రాశిని మారుస్తాడు. అదే సమయంలో, శుక్రుడు ప్రేమ, అందం, విలాసాలు, వైభవానికి కారకంగా పరిగణించబడతాడు.
సూర్యుడిని తండ్రి, ఆత్మ, శక్తి, విశ్వాసం, ప్రభుత్వ ఉద్యోగ కారకాలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం సూర్యుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. త్వరలో సూర్యుని సంచారం మేష రాశిలో ఉంటుంది. ఈ సమయంలో శుక్రుడు, కుజ గ్రహం మేష రాశిలో సంయోగం చెందుతారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం, సూర్యుడు ఏప్రిల్ 14న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మేష రాశిలో ప్రయాణించిన వెంటనే సూర్యుడు, శుక్రుల సంయోగం ఏర్పడుతుంది. గ్రహాల రాజులు అయిన సూర్యుడుతో శుక్రుడు కలయిక సుక్రాదిత్య రాజయోగాన్ని సృష్టిస్తుంది. సూర్యుడు, శుక్రుడి కలయిక మొత్తం 12 రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది. కానీ ఈ రాశులకు అనేక లాభాలు ఉంటాయి. మేష రాశిలో సూర్యుడు, శుక్రుడు సంయోగం ఏ రాశికి ప్రయోజనం కలిగిస్తుందో తెలుసుకుందాం.
ఏప్రిల్ 14 నుండి సూర్య, శుక్రుల సంయోగం.. ఈ రాశులకు లాభాలు
1.సింహ రాశి:
సింహ రాశి ప్రజలకు మేష రాశిలో సూర్యుడు, శుక్రుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాజయోగం సింహ రాశికి లాభదాయకంగా ఉంటుంది. మీ కెరీర్‌లో మీరు ఎంతో అదృష్టాన్ని పొందుతారు. సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారవేత్తలు కూడా కొత్త ఒప్పందాన్ని పొందవచ్చు. మీ ప్రేమ జీవితం మరియు ఆర్థిక జీవితంలో మీరు అనేక మార్పులను చూస్తారు.
2.మేష రాశి:
మేష రాశి వ్యక్తులకు సూర్య, శుక్రుల సంచారం ద్వారా ఏర్పడిన రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడిదారులను పొందుతారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. సంపద పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో శృంగారం కూడా పెరుగుతుంది.
3.మిథున రాశి:
మిథున రాశి ప్రజలకు, మేష రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయిక శుభప్రదమైనది. కుజ గ్రహం యొక్క మేష రాశిలో సూర్యుడు, శుక్రుడి సంచారం ద్వారా ఏర్పడే ఈ రాజయోగం మిథున రాశికి అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రత్యేక వ్యక్తి జీవితంలో ప్రవేశం ఉండవచ్చు. మీ కెరీర్‌లో మీ నైపుణ్యాలను చూపించడానికి మీకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు కూడా కొత్త డీల్‌ను పొందవచ్చు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనదని చెప్పము. మరిన్ని వివరాలు, మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
Peddinti Sravya, hyderabad

