Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాటా సియెర్రా ఈవీ కొనాలనుకుంటున్నారా? బ్యాటరీ, రేంజ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు ఇవే

టాటా సియెర్రా ఈవీ కొనాలనుకుంటున్నారా? బ్యాటరీ, రేంజ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు ఇవే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పేరును పునరుద్ధరిస్తూ టాటా మోటార్స్ ఎట్టకేలకు మోస్ట్ అవేటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టాటా సియెర్రా ఈవీ' (Tata Sierra EV) ని విడుదల చేసింది.

రూ. 18.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ప్రీమియం ఈవీ మొత్తం 6 వేరియంట్లు, రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఒకవేళ మీరు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ, ఏ బ్యాటరీ ఆప్షన్ ఎంచుకోవాలనే గందరగోళంలో ఉంటే.. మీకోసం ఈ కార్ బ్యాటరీలు, డ్రైవ్‌ట్రైన్, పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

బ్యాటరీ, డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లు

టాటా సియెర్రా ఈవీలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 63 kWh మరియు 75 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ఆప్షన్లను అందించారు. ఇవి రెండు రకాల డ్రైవ్‌ట్రైన్ సిస్టమ్స్‌తో వస్తాయి.

63 kWh బ్యాటరీ ప్యాక్: ఇది కేవలం రియర్-వీల్-డ్రైవ్ (RWD) సెటప్‌తో మాత్రమే లభిస్తుంది.

75 kWh బ్యాటరీ ప్యాక్: ఇది రియర్-వీల్-డ్రైవ్ (RWD), పవర్‌ఫుల్ క్వాడ్-వీల్-డ్రైవ్ (QWD) ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

వేరియంట్ల వారీగా పవర్, టార్క్, రేంజ్ వివరాలు

1. టాటా సియెర్రా ఈవీ 63 (RWD)

పవర్ & టార్క్: ఈ మోడల్ 235 bhp గరిష్ట పవర్‌ను, 315 Nm టాప్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

రేంజ్: ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది నిజమైన రోడ్డు పరిస్థితుల్లో (Real-world range) 460 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.

2. టాటా సియెర్రా ఈవీ 75 (RWD)

పవర్ & టార్క్: ఈ వేరియంట్ 206 bhp పవర్, 315 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

రేంజ్: ఈ మోడల్ అన్నింటికంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. ఇది 530 కిలోమీటర్ల రియల్-వరల్డ్ రేంజ్‌ను, 665 కిలోమీటర్ల ఎమ్‌ఐడీసీ (MIDC) సర్టిఫైడ్ రేంజ్‌ను కలిగి ఉంది.

3. టాటా సియెర్రా ఈవీ 75 (QWD - డ్యూయల్ మోటార్)

పవర్ & టార్క్: ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారి కోసం తెచ్చిన ఈ మోడల్‌లో డ్యూయల్ మోటార్ సెటప్ ఉంటుంది. దీని ముందు భాగంలో ఉండే మోటార్ 138 bhp, వెనుక వైపు ఉండే మోటార్ 206 bhp పవర్‌ను అందిస్తాయి. ఇది మొత్తంగా 504 Nm భారీ టార్క్‌ను విడుదల చేస్తుంది.

రేంజ్: ఎక్కువ పవర్ ఉన్నప్పటికీ, ఇది సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల వరకు రియల్-వరల్డ్ రేంజ్ ఇస్తుందని టాటా మోటార్స్ స్పష్టం చేసింది.

ఛార్జింగ్ సమయం (Charging Time)

టాటా సియెర్రా ఈవీలోని రెండు బ్యాటరీలు కూడా ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

  1. 63 kWh బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 25 నిమిషాల్లో 20 శాతం నుండి 80 శాతానికి టాప్-అప్ చేయవచ్చు.
  2. పెద్దదైన 75 kWh బ్యాటరీ ప్యాక్ 20% నుండి 80% ఛార్జింగ్ స్థాయిని చేరుకోవడానికి దాదాపు 26 నిమిషాల సమయం తీసుకుంటుంది.

మీకు రోజువారీ ప్రయాణాలతో పాటు మంచి రేంజ్, రీజనబుల్ బడ్జెట్ కావాలనుకుంటే 63 kWh (RWD) లేదా 75 kWh (RWD) మోడల్స్ ఉత్తమ ఎంపిక. అలా కాకుండా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆల్-వీల్ డ్రైవింగ్ సామర్థ్యం కావాలనుకుంటే క్వాడ్-వీల్-డ్రైవ్ (QWD) వేరియంట్ వైపు వెళ్లవచ్చు.

Tata Sierra EV: Battery & specifications details
Sierra EV 63Sierra EV 75Sierra EV 75 QWD
VariantPure, Adventure, EmpoweredAdventure, EmpoweredEmpowered
Battery pack63 kWh75 kWh
Motor

Single

Rear: PMSM

Single

Rear: PMSM

Dual

Front: Induction

Rear: PMSM

Maximum power235 bhp206 bhp

Front: 138 bhp

Rear: 206 bhp

Maximum torque315 Nm504 Nm
DrivetrainRWDQWD (AWD)
Ingress protection for motor & battery packIP67
DC fast charging (20%-80%)25 mins (above 110kW 260A charger input)26 mins (above 120kW 330A charger input)
AC fast charging (10%-100% using 7.2 KW charger)9.3 hours10.7 hours
Maximum range (MIDC)535 km665 km624 km
Real-world range440-460510-530480-500

Praveen Kumar Lenkala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu