Tagore Movie: ఠాగూర్ మూవీ చిరంజీవి కెరీర్ లో ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ పై మాత్రం వివాదం కొనసాగుతూనే ఉంది.
తాజాగా మరోసారి రాజశేఖర్ కామెంట్స్ తో ఈ రచ్చ మొదలైంది.
ఠాగూర్ రైట్స్ వివాదం
వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ మూవీ తమిళ సినిమా 'రమణ'కు రీమేక్. 2002లో తమిళ్ లో విజయ్ కాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన రమణ ఘన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ఫస్ట్ రాజశేఖర్ తీసుకోవాలనుకుని అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత చిరంజీవి కోసం ఠాగూర్ మధు ఎక్కువ డబ్బు ఇచ్చి ఈ రైట్స్ కొన్నాడు.
రాజశేఖర్ కామెంట్స్
తాజాగా ఠాగూర్ మూవీ రీమేక్ రైట్స్ పై రాజశేఖర్ మాట్లాడాడు. ''ఠాగూర్ సినిమాను నేను చేయాల్సింది. రీమేక్ రైట్స్ నేను కొన్నా. దీని కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చా. అయితే ఆ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ కదా అని అగ్రిమెంట్ చేసుకోకుండా మాట మీదే ఉండిపోయా'' అని రాజశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఎక్కువ డబ్బులిచ్చి
''నా ఫ్రెండ్ అయిన ప్రొడ్యూసర్ ను ఠాగూర్ మధు కలిశాడు. ఎక్కువ డబ్బులిచ్చి రీమేక్ రైట్స్ కొనుక్కున్నాడు. చిరంజీవి కోసం ఆ సినిమాను పట్టుకెళ్లిపోయాడు. నేను పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకోలేదు. అందుకే నాకు ఆ మూవీ దక్కలేదు'' అని రాజశేఖర్ అప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసి మళ్లీ రచ్చకు దారితీశాడు.
అప్పుడు ఏం చేశావంటూ?
తాను చేయాల్సిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఠాగూర్ ను చిరంజీవి చేశారంటూ రాజశేఖర్ మాట్లాడాడని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి అగ్రిమెంట్ చేసుకోకుండా అప్పుడు ఏం చేశారని అడుగుతున్నారు. రూల్స్ ప్రకారమే ఠాగూర్ మూవీ రైట్స్ ను నిర్మాత మధు తీసుకున్నాడని అంటున్నారు.
బ్లాక్ బస్టర్
2003లో రిలీజైన ఠాగూర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో యాంటీ కరెప్షన్ ఫోర్స్ అంటూ అవినీతిపై పోరాడే ప్రొఫెసర్ గా చిరంజీవి నటించారు. లంచం తీసుకోవడం నేరం అంటూ సమాజానికి ఉపయోగపడేలా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇందులో శ్రియా, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు.
ఠాగూర్ మూవీ 253 సెంటర్లలో 50 రోజులు, 192 సెంటర్లలో 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం విశేషం.
Chandu Shanigarapu

