Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ ఈఎంఐ క్యాలిక్యులేటర్- ప్రతి నెల ఎంత కట్టాలి? వేరియంట్ల వారీగా వివరాలు..

Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ ఈఎంఐ క్యాలిక్యులేటర్- ప్రతి నెల ఎంత కట్టాలి? వేరియంట్ల వారీగా వివరాలు..

భారతదేశంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ ఎస్‌యూవీ 'టాటా సియెర్రా ఈవీ' ఇటీవలే అధికారికంగా మార్కెట్లోకి విడుదలైంది. రూ. 18.79 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ క్రేజీ ఎలక్ట్రిక్ కారును లోన్​పై కొనాలనుకుంటే, నెలకు ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది?

ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

టాటా సియెర్రా ఈవీ- వేరియంట్లు, ధరల వివరాలు..

టాటా సియెర్రా ఈవీ మొత్తం 5 ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది: ప్యూర్, ప్యూర్ ఎస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ఏ. ఇందులో కస్టమర్ల కోసం 63 kWh, 75 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లతో పాటు.. రియర్-వీల్ డ్రైవ్ (ఆర్​డబ్ల్యూడీ), ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ/ క్యూడబ్ల్యూడీ) ఆప్షన్లను టాటా మోటార్స్ అందించింది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు వేరియంట్‌ను బట్టి రూ. 18.79 లక్షల నుంచి రూ. 25.99 లక్షల వరకు ఉన్నాయి.

టాటా సియెర్రా ఈవీ- లోన్, ఈఎంఐ క్యాలిక్యులేషన్..

మీరు ఈ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కారును ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, బేస్ వేరియంట్, టాప్ వేరియంట్లకు అయ్యే సుమారు నెలవారీ ఈఎంఐ అంచనా కింద ఇవ్వడం జరిగింది.

(గమనిక: ఈ లెక్కింపు కోసం ఎక్స్-షోరూమ్ ధరపై 100% లోన్ తీసుకున్నట్లు, బ్యాంక్ వడ్డీ రేటును 9.5% గా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది).

టాటా సియెర్రా ఈవీ- నెలవారీ ఈఎంఐ లెక్కలు
మోడల్- వేరియంట్ఎక్స్​షోరూం ధర (రూ.)లోన్ (ఎక్స్​షోరూం ధర మీద 100శాతం)వడ్డీ రేటురీపేమెంట్ టన్యూర్ (నెలల్లో)నెలవారీ ఈఎంఐ (రూ.)
Tata Sierra EV Pure 6318.79 లక్షలు18.79 లక్షలు9.5%24 86,273
3660,190
4847,206
Tata Sierra EV Empowered S 75 QWD25.99 లక్షలు25.99 లక్షలు24 119,332
3683,254
4865,295

1. బేస్ వేరియంట్: ప్యూర్ 63

ఎక్స్-షోరూమ్ ధర: రూ. 18.79 లక్షలు

  • 2 ఏళ్ల టెన్యూర్ (24 నెలలు): నెలకు సుమారు రూ. 86,273 కట్టాలి.
  • 3 ఏళ్ల టెన్యూర్ (36 నెలలు): నెలకు సుమారు రూ. 60,165 కట్టాలి.
  • 4 ఏళ్ల టెన్యూర్ (48 నెలలు): నెలకు సుమారు రూ. 47,206 కట్టాలి.

2. టాప్ వేరియంట్: ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ

ఎక్స్-షోరూమ్ ధర: రూ. 25.99 లక్షలు

  • 2 ఏళ్ల టెన్యూర్ (24 నెలలు): నెలకు సుమారు రూ. 1,19,332 కట్టాలి.
  • 3 ఏళ్ల టెన్యూర్ (36 నెలలు): నెలకు సుమారు రూ. 83,222 కట్టాలి.
  • 4 ఏళ్ల టెన్యూర్ (48 నెలలు): నెలకు సుమారు రూ. 65,295 కట్టాలి.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న నెలవారీ ఈఎంఐ విలువలు కేవలం ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. మీరు చెల్లించే డౌన్ పేమెంట్, తీసుకునే లోన్ మొత్తం, మీ సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేటు, టెన్యూర్ మారితే ఈ నెలవారీ ఈఎంఐ మొత్తంలో మార్పులు ఉంటాయి. అలాగే కారు ఆన్-రోడ్ ధరలో పన్నులు, ఇన్సూరెన్స్ అదనంగా ఉంటాయి.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu