TG DOST Web Options 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది.
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (TG DOST) 2026 విద్యాసంవత్సరానికి గానూ మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభంగా… అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్లు ఎంచుకునేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఈ మూడో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జూన్ 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. డిగ్రీలో చేరాలనుకునే అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, గ్రూపులు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎంచుకోవాల్సి ఉంటుంది.
జూన్ 20న సీట్ల కేటాయింపు
మూడో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు సమర్పించిన వెబ్ ఆప్షన్లను అధికారులు పరిశీలిస్తారు. అభ్యర్థుల మెరిట్ మార్కులు, రిజర్వేషన్ల నిబంధనల ఆధారంగా జూన్ 20వ తేదీన ఫేజ్ 3 తుది సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.
సీట్లు పొందిన విద్యార్థులు తమ ప్రవేశాన్ని ఖరారు చేసుకోవడానికి జూన్ 20 నుండి జూన్ 25వ తేదీ మధ్యలో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారి సీట్లు రద్దవుతాయి.
కొత్తగా దోస్త్ కౌన్సెలింగ్ కోసం రిజిస్టర్ చేసుకునే అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. దీనివల్ల ఓటీపీల ప్రక్రియ సులువవుతుంది. ఇప్పటికే మొదటి లేదా రెండో విడత కౌన్సెలింగ్‌లో సీటు సాధించి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీల కోసం ఈ థర్డ్ ఫేజ్‌లో నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
దోస్త్ ఫేజ్ 3లో గనుక విద్యార్థికి కొత్తగా సీటు కేటాయిస్తే…. గతంలో వచ్చిన పాత సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు మరియు ఇతర పూర్తి వివరాల కోసం దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in ను సందర్శించవచ్చు.
TS DOST 2026 : రిజిస్ట్రేషన్ ప్రాసెస్
1. TS DOST అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమను తాము నమోదు చేసుకోవాలి.
4. నమోదు పూర్తయిన తర్వాత, దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేయాలి.
5. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన విద్యార్థులు… వారి లాగిన్ వివరాల ద్వారా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి.
Maheshwaram Mahendra Chary

