Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG EAPCET 2026 : టీజీ ఈఏపీసెట్ బీ-ఫార్మసీ, ఫార్మ్‌-డీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్

TG EAPCET 2026 : టీజీ ఈఏపీసెట్ బీ-ఫార్మసీ, ఫార్మ్‌-డీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TGEAPCET ద్వారా ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం బీ.ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సులలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఇప్పటికే సర్టిఫికేట్లు ధృవీకరించుకున్న అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 3, 4 తేదీలలో తమ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీన తమ ఆప్షన్లను తప్పనిసరిగా ఫ్రీజ్ చేయాలి.

సీట్ల తాత్కాలిక కేటాయింపు సెప్టెంబర్ 6వ తేదీన లేదా అంతకంటే ముందుగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్-రిపోర్టింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత సెప్టెంబర్ 8వ తేదీలోగా కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలి.

TGEAPCET-2026 ప్రవేశాల ద్వారా ఇప్పటికే ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో చేరిన అభ్యర్థులు ఆప్షన్లను ఎంచుకోవడానికి అర్హులు కారు. కౌన్సెలింగ్ ఒకే దశలో నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ ఆప్షన్లను జాగ్రత్తగా ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 5 వరకు జరిగింది. అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగస్ట్ 2న ముగిసింది. టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం… తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను ఆగస్టు 5 నాటికి పూర్తి చేసి, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య ఆన్‌లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేశారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు కోరారు. కచ్చితంగా చేరడానికి ఆసక్తి ఉన్న కళాశాలలు, కోర్సులను మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

Anand Sai, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu