Dailyhunt
TG Gurukul CET Result 2026 : గురుకులాల్లో బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

TG Gurukul CET Result 2026 : గురుకులాల్లో బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లోని బ్యాక్ లాగ్ సీట్లను భర్తీ కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ (TG Gurukul CET 2026) నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే 5వ తరగతి ఫలితాలు రాగా… తాజాగా 6 నుంచి 9 తరగతిలోని ఖాళీలను భర్తీ చేసే పరీక్ష ఫలితాలను విడుదల చేశారు

ఫిబ్రవరి నెలలోనే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తి అయింది. ప్రాథమిక కీలు విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. మొత్తం ప్రాసెస్ పూర్తి కావటంతో తాజాగా ర్యాంక్ కార్డులను ప్రకటించారు.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREISల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ గురుకుల సొసైటీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది. ఉచిత వసతి కల్పిస్తారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:

  1. ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని బ్యాక్ లాగ్ వెకెన్సీ రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందొచ్చు
  6. అడ్మిషన్ ప్రాసెస్ లో ర్యాంక్ కార్డు చాలా కీలకం. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఈ గురుకుల సెట్‌ - 2026లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడుతారు. ఈ సీట్లకు కొంతకాలంగా చాలా డిమాండ్ ఉంటోన్న సంగతి తెలిసిందే. చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురుకులాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):

ప్రశ్న: ఈ ఫలితాలు ఏ తరగతులకు సంబంధించినవి?

జవాబు: తెలంగాణ గురుకులాల్లోని 6, 7, 8 మరియు 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలివి.

ప్రశ్న: ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి?

జవాబు: అధికారిక వెబ్‌సైట్ https://tgcet.cgg.gov.in/ లో మీ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న: సీట్ల కేటాయింపు ఎలా ఉంటుంది?

జవాబు: విద్యార్థులు ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, వారు ఎంచుకున్న పాఠశాలతో పాటు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లను కేటాయిస్తారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu