Dailyhunt
TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై కసరత్తు - మే మొదటి వారంలో రిజల్ట్స్...!

TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై కసరత్తు - మే మొదటి వారంలో రిజల్ట్స్...!

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గతేడాదికి భిన్నంగా ఈసారి షెడ్యూల్ ఉండగా… విద్యార్థులకు చాలా సమయం ఇచ్చారు. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు.

ఫలితంగా నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి.

గత మార్చి 14వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 7వ తేదీన బయాలజీ పేపర్ పూర్తి అయింది. మిగతా సబ్జెక్టులన్నీ కలిపి ఏప్రిల్ 16వ తేదీతో పూర్తవుతాయి.

స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం…!

ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే… మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… ఏప్రిల్ 23వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. అంతా ఒకే అనుకుంటే… ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపుతుంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే… అధికారికంగా ఓ తేదీని ఖరారు చేస్తారు.

తెలంగాణ టెన్త్ ఫలితాలు ఎప్పుడు రావొచ్చు..?

ప్రాథమిక అంచనాల ప్రకారం…. తెలంగాణ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 23 నాటికి స్పాట్ పూర్తి అయితే… మరో వారం రోజుల పాటు క్రీడకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. మే 4 లేదా 5 తేదీలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రభుత్వ పరీక్ష విభాగం నుంచి ప్రకటన రానుంది.

టెన్త్ ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలైన తర్వాత https://bse.telangana.gov.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/telugu ) లోనూ అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu