Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tirupati SIHM Admissions 2026 : హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

Tirupati SIHM Admissions 2026 : హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

Tirupati SIHM Admissions 2026 : ఆతిథ్య రంగానికి (హాస్పిటాలిటీ) ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న వేళ…. ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (SIHM) మంచి అవకాశం కల్పిస్తోంది.

2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రమణ ప్రసాద్ వివరాలను వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక శాఖల ఉమ్మడి భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ, నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందిస్తోంది. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో నైపుణ్యాలను పెంపొందించేలా ఇక్కడ కోర్సులను రూపొందించారు.

  • బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ : ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన విద్యను పూర్తి చేసిన వారు ఈ మూడేళ్ల డిగ్రీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • క్రాఫ్ట్స్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ : పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఏడాదిన్నర (1.5 ఏళ్లు) వ్యవధి గల ఈ కోర్సు అందుబాటులో ఉంది.

పరిశ్రమ శిక్షణ - ఉద్యోగ అవకాశాలు:

కేవలం తరగతి గది విద్యకే పరిమితం కాకుండా, విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం అందించడానికి ఈ కోర్సుల్లో ప్రాధాన్యమిస్తున్నారు. అందులో భాగంగా విద్యార్థులకు 17 వారాల పాటు నేరుగా ప్రముఖ హోటల్ పరిశ్రమల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇస్తారు.

ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న ఎంతో మంది విద్యార్థులు ఇప్పటికే దేశ విదేశాల్లోని ప్రముఖ స్టార్ హోటళ్లు, హాస్పిటాలిటీ గ్రూపులలో అత్యుత్తమ వేతనాలతో స్థిరపడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

దరఖాస్తు విధానం….

ఆసక్తి ఉన్న అభ్యర్థులు కళాశాల అధికారిక వెబ్‌సైట్ www.sihmtpt.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా నేరుగా తిరుపతిలోని కళాశాల ప్రాంగణానికి వెళ్లి కూడా అప్లికేషన్లు సమర్పించవచ్చు.

  • ఫోన్ నంబర్లు: 97013 73846, 97004 40604
  • ఇ-మెయిల్: sihmtpt@gmail.com

Maheshwaram Mahendra Chary, Tirupati

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu