Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toxic Collections: కేజీఎఫ్ రేంజ్ అనుకుంటే దెబ్బకొట్టిన అడల్ట్ కంటెంట్-మండే టెస్టులో టాక్సిక్ ఫెయిల్-యశ్ మూవీకి 7 కోట్లే!

Toxic Collections: కేజీఎఫ్ రేంజ్ అనుకుంటే దెబ్బకొట్టిన అడల్ట్ కంటెంట్-మండే టెస్టులో టాక్సిక్ ఫెయిల్-యశ్ మూవీకి 7 కోట్లే!

Toxic Collections: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) సినిమా మండే టెస్టులో దారుణంగా ఫెయిల్ అయింది.

బంపర్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, ఆరవ రోజు నాటికి సింగిల్ డిజిట్ వసూళ్లకు పడిపోయి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.

టాక్సిక్ కలెక్షన్ల పతనం

మొదటి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన 'టాక్సిక్', ఆ తర్వాత అదే ఊపును కొనసాగించడంలో దారుణంగా విఫలమైంది. దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.101 కోట్ల నెట్ (రూ. 120 కోట్ల గ్రాస్) వసూలు చేసి, ఈ ఏడాది 'ధురంధర్ 2' (రూ.103 కోట్లు) తర్వాత సెకండ్ బెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది టాక్సిక్.

మండే టెస్టు

టాక్సిక్ సినిమాకు వచ్చిన నెగెటివ్ టాక్ ప్రభావంతో.. శనివారం రూ.25.15 కోట్లు, ఆదివారం రూ.23 కోట్లు మాత్రమే రాబట్టింది. సోమవారం (సెప్టెంబర్ 1) నాటికి ఏకంగా 67.6% క్షీణించి కేవలం రూ.7.45 కోట్ల నెట్ వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 13,400 షోలో కేవలం 17.1% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది.

కేజీఎఫ్ 2 ఇలా

'కేజీఎఫ్ 2' మొదటి ఐదు రోజుల్లో ఇండియాలో రూ.430.15 కోట్లు రాబట్టగా.. 'టాక్సిక్' అందులో సగం కూడా సాధించలేకపోయింది. టాక్సిక్ ఆరు రోజులకు గాను ఇండియాలో మొత్తం రూ.221.55 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.304.05 కోట్ల గ్రాస్ సాధించింది.

యశ్‌కు అండగా సుమలత

సినిమాలోని మితిమీరిన హింస, అడల్ట్ కంటెంట్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో యశ్‌కు నటి సుమలత మద్దతుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

''బహుశా టాక్సిక్ దాని కాలం కంటే ముందున్న సినిమా కావచ్చు లేదా కొంతమంది దానిని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. ఈ సినిమాలో నీ నటన అద్భుతం. ఇలాంటి నెగెటివ్ టాక్‌ను ఒక చిటికెడు ఉప్పులా భావించి వదిలేయ్" అని ఆమె యశ్‌కు ధైర్యం చెప్పారు.

ఫెయిల్యూర్‌కు అసలు కారణం ఏంటి?

ఒక పాన్-ఇండియా యాక్షన్ స్టార్ సినిమాకు కేవలం భారీ ఓపెనింగ్స్ వస్తే సరిపోదు.. రిపీట్ ఆడియన్స్ ఉండాలి. 'కేజీఎఫ్' ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. అందులో తల్లి సెంటిమెంట్ పండింది. కానీ, గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే టాక్సిక్ లోని మితిమీరిన వయొలెన్స్, మహిళలను తక్కువ చేసి చూపించే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రాకుండా అడ్డుకున్నాయి.

గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ స్టైల్ ఒక డార్క్ ఆర్ట్ ఫిల్మ్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు దగ్గరగా ఉంటుంది. మాస్ ఆడియన్స్ కోరుకునే రెగ్యులర్ ఎలివేషన్స్, కమర్షియల్ హంగులు మిస్ అవ్వడం వల్ల కూడా టాక్సిక్ కు దెబ్బపడిందని అంటున్నారు.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu