Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. సెలబ్రిటీలు తిరుమలకు రావడం కామనే కదా, ఇందులో స్పెషాలిటీ ఏముందని అంటారా?
ఈ రోజు తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అంతే కాకుండా సోమవారమే (మే 4) త్రిష బర్త్ డే కూడా కావడం విశేషం.
తిరుమలలో త్రిష
త్రిష తిరుమలకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్రిష బర్త్ డే రోజే తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష తిరుమలకు రావడం హాట్ టాపిక్ గా మారింది. తిరుమలలో త్రిష ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎందుకు వచ్చిందంటూ?
సెలబ్రిటీలు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం సాధారణమే. కానీ ఇవాళ త్రిష తిరుమలకు రావడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజే రాబోతున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ స్టార్ట్ అయింది.
విజయ్ కోసమేనా?
ఇటీవల కాలంలో తమిళనాడు స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్, త్రిష వ్యవహారం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వీళ్ల మధ్య రిలేషన్ షిప్ ఉందనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే విజయం సాధించాలని ప్రార్థించడం కోసమే త్రిష తిరుమలకు వచ్చిందని కొంతమంది అంటున్నారు.
బర్త్ డే సందర్భంగా
ఈ రోజు త్రిష బర్త్ డే కూడా. అందుకే తన పుట్టిన రోజున శ్రీవారిని ఆమె దర్శించుకుందని, ఇందులో ఎలాంటి కారణాలు వెతకాల్సిన అవసరం లేదని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా తమిళనాడు అసెంబ్లీ 2026 ఎన్నికల రోజున త్రిష తిరుమలకు రావడం మాత్రం ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
విజయ్, త్రిష
కొంతకాలంగా దళపతి విజయ్, త్రిష మధ్య సంబంధంపై బలమైన రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల తన భర్తకు వేరే హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిషనే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మరోవైపు సినిమాలకు గుడ్ బై చెప్పిన విజయ్.. రాజకీయ నాయకుడిగా మారాడు. టీవీకే పార్టీని స్థాపించాడు. ఈ తమిళనాడు 2026 ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేసింది. మరి తమిళనాడు ఓటర్ల మనసును విజయ్ గెలిచాడా? లేదా? అన్నది మరొకొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
Chandu Shanigarapu

