Trisha Satire On Suriya Karuppu Movie Team: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తన తాజా చిత్రం 'కరుపు' టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.
చిత్ర ఆడియో లాంచ్‌కు ఆమె హాజరుకాకపోవడంపై విమర్శలు వస్తున్న తరుణంలో, త్రిష ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రీతిగా త్రిష ఫస్ట్ లుక్.. నెటిజన్ల ప్రశంసలు
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష జంటగా నటిస్తున్న భారీ చిత్రం 'కరుపు' మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం త్రిషకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆమె 'ప్రీతి' అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు.
37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో త్రిష కోర్టు రూమ్‌లో సీరియస్ లాయర్‌గా, మరో సీన్‌లో ఆకుపచ్చ చీరలో డ్యాన్స్ చేస్తూ మెరిశారు. 43 ఏళ్ల వయసులోనూ త్రిష ఇంత యంగ్‌గా ఎలా ఉందంటూ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
వివాదానికి దారితీసిన రీ-ట్వీట్
అయితే, ఒక అభిమాని చేసిన పోస్ట్‌ను త్రిష రీ-షేర్ చేయడంతో వివాదం మొదలైంది. "కరుపు సినిమాలో త్రిష ఉందన్న విషయమే మర్చిపోయాను. ఆమె ఏజ్ రివర్స్ గేర్‌లో వెళ్తోంది" అని ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు త్రిష స్పందిస్తూ.. "ధన్యవాదాలు. నేనూ మర్చిపోయాను. కనీసం ఇప్పటికైనా వారు రిమైండర్ సెట్ చేసినందుకు సంతోషం" అంటూ చిత్ర యూనిట్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దీనిపై ఒక సూర్య అభిమాని స్పందిస్తూ.. "ఆడియో లాంచ్‌కే రాని నీకు ఇంత నక్కల్ (వెటకారం) అవసరమా?" అని ప్రశ్నించారు. దానికి త్రిష ఏమాత్రం తగ్గకుండా.. "నా ఇన్విటేషన్ బహుశా మెయిల్‌లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందిలే" అంటూ తనను ఆ వేడుకకు ఆహ్వానించలేదని పరోక్షంగా బాంబు పేల్చారు. ఆడియో లాంచ్ పోస్టర్లలో ఆమె పేరున్నప్పటికీ, పిలవకుండా పోస్టర్లు వేస్తే ఎలా వస్తారని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు.
వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు
త్రిష కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా తన 'గిల్లి' కో-స్టార్, దళపతి విజయ్‌తో త్రిష డేటింగ్‌లో ఉందంటూ వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో పాటు, విజయ్-త్రిష కలిసి ఒక వివాహ వేడుకలో కనిపించడం ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చింది.
ప్రస్తుతం త్రిష చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మే 14న విడుదల కానున్న 'కరుపు'తో పాటు మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' (తెలుగు), మోహన్ లాల్‌తో 'రామ్' (మలయాళం) చిత్రాల్లో త్రిష నటిస్తున్నారు. వివాదాలు ఎలా ఉన్నా, మే 4న తన పుట్టినరోజు జరుపుకోబోతున్న త్రిష, ప్రస్తుతం తన 'మే' సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

