Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TTD : ఆగస్టు నెలలో శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

TTD : ఆగస్టు నెలలో శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో, ఇతర అనుబంధ ఆలయాల్లో ఆగస్టు నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ తేదీలను ప్రకటించింది. ఆ వివరాలేంటో చూడండి.

శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో

ఆగష్టు 7, 14, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆగష్టు 25న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు సాయంత్రం 6.45 గంటలకు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.

ఆగష్ఠు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరుగుతుంది.

శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో

ఆగష్టు 8న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో

ఆగష్టు 3, 30వ తేదీలల్లో ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్రహించనున్నారు.

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో

ఆగష్టు 17న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులను కటాక్షించనున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయం

ఆగష్టు 1, 8, 15, 22, 29వ తేదీలలో వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు అభిషేకం.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

ఆగష్టు 4న తేదీ ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

ఆగష్టు 7, 14, 21, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

ఆగష్టు 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

ఆగష్టు 26న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం.

ఆగష్టు 2, 9, 16, 23, 30వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం.

పుష్పయాగ మహోత్సవం

తిరుపతి నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో, నిత్యకైంకర్యాల్లో అనుకోకుండా జరిగిన లోపాల పరిహారార్థం ఆలయ ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సుమారు ఒక టన్ను సుగంధ పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం ఘనంగా సమర్పించారు. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువ తదితర 18 రకాల పుష్పాలు, ఆరు రకాల పవిత్ర పత్రాలతో విశేష అర్చన నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవించారు.

రంగురంగుల పుష్పాలతో అలంకరించిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్యసన్నిధి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుష్పయాగ మహోత్సవాన్ని దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు. అనంతరం గోవింద నామస్మరణల నడుమ స్వామివారి వీధి ఉత్సవం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది.

Anand Sai, Tirupati

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu