Tirumala Srivani Tickets : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రోజువారీగా ఆన్ లైన్ లో జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్లను ఇవాళ మాత్రం ఆఫ్ లైన్ లో జారీ చేయనున్నట్లు తెలిపింది.
సర్వర్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇవాళ మధ్యాహ్నం నుంచి తిరుమలలోని అన్నమయ్య భవన్ కు ఎదురుగా ఉన్న శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ లో టికెట్లను జారీ చేస్తున్నారు. టికెట్ పొందిన భక్తులు సాయంత్రం 4 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
రేపటి నుంచి ఆన్ లైన్ లోనే…!
రోజువారీ కోటా అయిన 800 టికెట్లు పూర్తి అయ్యే వరకు మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ప్రాతిపదికన టికెట్లు జారీ చేస్తారు. రేపటి(ఏప్రిల్ 12) నుంచి యథావిధిగా శ్రీవాణి దర్శన కోటా ఆన్ లైన్ లో విడుదల చేయబడుతాయని టీటీడీ స్పష్టం చేసింది. కేవలం ఈరోజుకు మాత్రమే ఆఫ్‌లైన్ ద్వారా ఉంటుందని వివరించింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):
- శ్రీవాణి టికెట్లు అంటే ఏమిటి..?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని త్వరితగతిన దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ ప్రవేశపెట్టిన ప్రత్యేక టికెట్లే 'శ్రీవాణి' టికెట్లు.
2. ఈ టికెట్ ద్వారా ఎలాంటి దర్శనం లభిస్తుంది…?
శ్రీవాణి టికెట్ పొందిన వారికి వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పిస్తారు.
3. ఆఫ్‌లైన్‌లో ఎక్కడ తీసుకోవాలి?
తిరుమలలోని అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న శ్రీవాణి కౌంటర్ లో ఈ టికెట్లు లభిస్తాయి.
Maheshwaram Mahendra Chary, Tirumala

