Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో పుష్య నక్షత్రంలోకి సూర్యుడు - అదృష్టం వరించే లక్కీ రాశులివే

త్వరలో పుష్య నక్షత్రంలోకి సూర్యుడు - అదృష్టం వరించే లక్కీ రాశులివే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజుగా పిలిచే సూర్య భగవానుడు త్వరలోనే తన నక్షత్ర గమనాన్ని మార్చబోతున్నాడు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న సూర్యుడు, సోమవారం నాడు నక్షత్ర సంచారం చేయనున్నారు.

ఉదయాన్నే సూర్య దేవుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. జ్యోతిష్య నిధుల ప్రకారం పుష్య నక్షత్రానికి అధిపతి శని గ్రహం. సూర్యుడు, శని గ్రహాల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ, ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అమితమైన లాభాలను, మరికొన్ని రాశుల వారికి కొన్ని సవాళ్లను తీసుకురానుంది.

సూర్య భగవానుడి ఈ నక్షత్ర మార్పు జూలై 20వ తేదీ ఉదయం 11:33 గంటలకు ప్రారంభమై…. ఆగస్టు 3వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 15 రోజుల పాటు సూర్యుడు శని నక్షత్రమైన పుష్య నక్షత్రంలోనే సంచరిస్తారు. ఈ కాలంలో సూర్యుని మారుతున్న కదలిక వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మిథున రాశి :

మిథున రాశి వారికి శని నక్షత్రంలో సూర్యుని సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించని శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కలిసివచ్చే కాలం కావడంతో సంపద, ఆస్తులు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గత కొంతకాలంగా తల్లి ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. కుటుంబం, పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న డబ్బుకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.

మేష రాశి:

శని నక్షత్రంలో సూర్యుని సంచారం మేష రాశి ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారబోతోంది. గతంలో ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో మీరు చేసిన పాత పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందించి, మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. సూర్య భగవానుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల సమాజంలో మీ స్థానం, గౌరవ ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి.

సింహ రాశి :

సింహ రాశి వారికి కూడా సూర్యుని నక్షత్ర మార్పు అద్భుతమైన విజయాలను చేకూరుస్తుంది. కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల్లో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, ఈ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కొన్నేళ్లుగా నిలిచిపోయి సాగదీస్తున్న పనులన్నీ ఇప్పుడు వేగవంతం అవుతాయి. వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి లాభాలు ఆర్జిస్తారు.

చేయాల్సిన పరిహారాలు….

జాతకంలో సూర్య గ్రహం బలంగా ఉంటే సమాజంలో కీర్తి, ప్రతిష్టలు, ఉన్నత హోదా లభిస్తాయి. సూర్యుని నక్షత్ర మార్పు సమయంలో సూర్యగ్రహాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం (నీరు) ఇవ్వడం ఎంతో మంచిది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నమ్మకాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చినది మాత్రమే. దీనిని పూర్తిగా నిజమని, ఖచ్చితమైనదని మేము ధృవీకరించడం లేదు. మరింత సమాచారం మరియు పూర్తి వివరాల కోసం సంబంధిత రంగ నిపుణులను లేదా జ్యోతిష్యులను సంప్రదించగలరు.

Maheshwaram Mahendra Chary, नई दिल्ली

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu