Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Udhayanidhi Stalin: ఉదయనిధిని లోపలేయడం మంచి పనే.. నోటికొచ్చినట్లు మాట్లాడితే జైల్లో వేయాల్సిందే: కంగనా రనౌత్

Udhayanidhi Stalin: ఉదయనిధిని లోపలేయడం మంచి పనే.. నోటికొచ్చినట్లు మాట్లాడితే జైల్లో వేయాల్సిందే: కంగనా రనౌత్

Udhayanidhi Stalin: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)పై తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం, డీఎంకే (DMK) కీలక నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సౌత్ ఇండియా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఒక పబ్లిక్ ర్యాలీలో త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు పోలీసులు అతడిని నిర్బంధించగా, ఈ వ్యవహారంపై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో స్పందించారు.

బహిరంగ సభల్లో అసభ్యకర పదజాలం వాడటం, మహిళలను కించపరిచేలా డబుల్ మీనింగ్ జోకులు వేయడం ఏ నాగరిక సమాజం కూడా ఒప్పుకోదని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా రాసుకొచ్చారు.

"జైలుకు వెళ్లడం మంచి పరిణామమే".. సోషల్ మీడియాలో కంగనా రచ్చ

ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ వార్తలపై స్పందిస్తూ కంగనా రనౌత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. "ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపడం ఒక మంచి పరిణామం. అతనికి బెయిల్ వచ్చి ఉండవచ్చు, కానీ చట్టం ముందు అందరూ సమానమే అనే సంకేతం ఇవ్వడం చాలా అవసరం" అని కంగనా పేర్కొన్నారు.

నటిగా మాత్రమే కాకుండా ఒక పార్లమెంట్ సభ్యురాలిగా మహిళల ఆత్మగౌరవంపై దెబ్బతీసే వ్యాఖ్యలను సహించేది లేదని కంగనా స్పష్టం చేశారు.

కావాలనే వివాదం.. అసలు పబ్లిక్ ర్యాలీలో ఏం జరిగింది?

కావేరి నదీ జలాల సమస్యపై ఏర్పాటు చేసిన ఒక పబ్లిక్ మీటింగ్‌లో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో ఆడియన్స్ నుంచి కొందరు త్రిష పేరును గట్టిగా అరిచారు. దీంతో ఉదయనిధి నవ్వుతూ కావేరి నీళ్లతో పాటు త్రిషను ముడిపెడుతూ డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి చెందిన పాలిటికల్ పార్టీ టీవీకే (TVK) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులు, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసు శాఖ ఉదయనిధిని తన చెన్నై నివాసంలో నిర్బంధించింది.

"ఇదొక పెద్ద కామెడీ".. ఉదయనిధి స్టాలిన్ కౌంటర్

పోలీస్ వ్యాన్‌లో నుంచి మీడియాతో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ఈ అరెస్ట్ వ్యవహారాన్ని ఒక పెద్ద కామెడీగా అభివర్ణించారు. "నేను ఏ ఒక్కరి పేరును ప్రత్యక్షంగా తీయలేదు, ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారు. చట్టపరంగా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని ధీమా వ్యక్తం చేశారు.

డీఎంకే సీనియర్ నేత టిఆర్ బాలు కూడా ఉదయనిధికి మద్దతుగా నిలుస్తూ, ఇవన్నీ కల్పిత కథలని, ఏ ఒక్క మహిళ పేరును ఉదయనిధి ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.

మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు.. బెయిల్‌పై రిలీజ్

మరోవైపు ఉదయనిధి స్టాలిన్ వేసిన అత్యవసర యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణాధికారి జస్టిస్ జి.కె.ఇళందిరైయన్ ఉదయనిధిని ప్రశ్నించిన వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించారు.

తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, ఉదయనిధిని కస్టడీలోకి తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కేవలం విచారణ కోసమే పిలిచామని వివరించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఈ కేసుకు సంబంధించిన విచారణను ముగించింది.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu