Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Udhayanidhi Trisha: త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ కామెంట్స్.. సీఎం నోరువిప్పడం లేదంటూ విజయ్‌పైనా విమర్శలు!

Udhayanidhi Trisha: త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ కామెంట్స్.. సీఎం నోరువిప్పడం లేదంటూ విజయ్‌పైనా విమర్శలు!

Udhayanidhi Stalin Double Meaning Comments On Trisha: సినిమా, రాజకీయం రెండూ కలగాపులగంగా మారే తమిళనాడు రాజకీయాల్లో మరో వివాదం రాజేసుకుంది. తంజావూరులో నిర్వహించిన కావేరి నీటి సమస్య సభలో తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

త్రిష పేరు లాగుతూ

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్‌లను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో, హీరోయిన్త్రిష పేరును లాగుతూ ఉదయనిధి స్టాలిన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

సభలో ఉదయనిధి ఏమన్నారు?

కావేరి జలాల వివాదంపై ఉదయనిధి వేదికపై నుంచి ప్రసంగిస్తున్నారు. "మన సీఎం కావేరి జలాల అంశంపై నోరు విప్పడం లేదు. డీఎంకే నాయకులపై అబద్ధపు కేసులు పెట్టడంలోనే ఆయన నిమగ్నమయ్యారు" అని విమర్శిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సభలోని ప్రేక్షకుల నుంచి ఎవరో నటి త్రిష పేరును గట్టిగా అరిచారు.

నీళ్లు అయితే రావాలి

సభికుల వైపు చూసి నవ్విన ఉదయనిధి స్టాలిన్ "నీళ్లు వస్తున్నాయో లేదో తెలీదు కానీ, ఆ నీళ్లు అయితే రావాలి.. నేను చెప్పేది కావేరి నీళ్ల గురించి" అంటూ డబుల్ మీనింగ్‌తో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదికపై ఉన్నవారు, సభకు వచ్చిన కొందరు నవ్వుతూ ఈలలు వేసినప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నెటిజన్లు, రాజకీయ నేతల తీవ్ర ఆగ్రహం

వేలాది మంది పురుషుల సమక్షంలో ఒక మహిళా నటిని ఉద్దేశించి ఇలాంటి చవకబారు ద్వందార్థ వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. "రైతుల సమస్యలపై పోరాటం అని డ్రామాలాడుతూ, ఒక మహిళ పట్ల ఇలాంటి అసభ్యకరమైన పదజాలం వాడటం ఆయన సంస్కారానికి నిదర్శనం" అని నెటిజన్లు ధ్వజమెత్తారు.

మహిళల పట్ల ఇలాంటి భాష

"ప్రజాక్షేత్రంలో ఉండే ఒక నాయకుడు మహిళల పట్ల ఇలాంటి భాష ఉపయోగించడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ప్రగతిశీల భావాలు ఉన్నాయని చెప్పుకునే ఉదయనిధి అసలు నైజం ఇదేనా?", "వాళ్ల అమ్మ, కూతురు చాలా గర్వంగా ఫీల్ అవుతారు" అని నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిలదీస్తున్నారు.

త్రిషను లక్ష్యంగా చేసుకోవడం ఇది తొలిసారి కాదు

స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఊపందుకున్నప్పటి నుంచి, త్రిషను దీనిలోకి లాగడం ఇది మొదటిసారి కాదు. గతంలో తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ కూడా విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ముందు 'త్రిష ఇల్లు వదిలి బయటకు రావాలి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

స్పందించని త్రిష, విజయ్

అప్పట్లో త్రిష లీగల్ టీమ్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై నటి త్రిష గానీ, నటుడు విజయ్ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి, బహిరంగ సభలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటంపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu