Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరంగల్, విజయవాడ మీదుగా బెంగళూరు - ఈ డైలీ ఎక్స్​ప్రెస్ ట్రైన్ ఇక రెగ్యులర్! టైమింగ్స్ ఇలా

వరంగల్, విజయవాడ మీదుగా బెంగళూరు - ఈ డైలీ ఎక్స్​ప్రెస్ ట్రైన్ ఇక రెగ్యులర్! టైమింగ్స్ ఇలా

Danapur SMVT Bengaluru Daily Express : తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ప్యాసింజర్లకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ప్రయాణికుల తీవ్ర రద్దీ, డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని దానాపూర్ - SMVT బెంగళూరు - దానాపూర్ (రైలు నంబర్లు 22365 / 22366) మధ్య నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును క్రమబద్ధీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నిర్ణయంతో బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు మరింత మెరుగైన రైలు రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

  • రైలు నంబర్ 22365 (దానాపూర్ - బెంగళూరు) : 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుండి దానాపూర్ స్టేషన్ నుంచి ప్రతిరోజూ రెగ్యులర్ సర్వీసుగా బయలుదేరుతుంది.
  • రైలు నంబర్ 22366 (SMVT బెంగళూరు - దానాపూర్) : 2026 సెప్టెంబర్ 3వ తేదీ నుండి SMVT బెంగళూరు నుండి ప్రతిరోజూ దానాపూర్ వైపునకు తన రెగ్యులర్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

ఈ డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు మీదుగా ప్రయాణిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

దానాపూర్ నుంచి SMVT బెంగళూరు… టైమింగ్స్

ఈ రైలు దానాపూర్‌లో మధ్యాహ్నం 14:45 గంటలకు బయలుదేరి, ఆరా వద్ద 15:16/15:18 గంటలకు ఆగుతుంది. మరుసటి రోజు సాయంత్రం 19:00/19:02 గంటలకు తెలంగాణలోని వరంగల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత రాత్రి 23:35/23:45 గంటలకు విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది. రెండవ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 01:28/01:30 గంటలకు ఒంగోలు, ఉదయం 04:53/04:55 గంటలకు గూడూరు చేరుకుంటుంది. అనంతరం కర్ణాటకలోని వైట్‌ఫీల్డ్ స్టేషన్‌కు మధ్యాహ్నం 13:20/13:22 గంటలకు చేరుకుని, చివరికి మధ్యాహ్నం 14:30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

బెంగళూరు నుంచి దానాపూర్ … టైమింగ్స్

తిరుగు ప్రయాణంలో ఈ రైలు బెంగళూరులో రాత్రి 23:50 గంటలకు బయలుదేరి, అర్ధరాత్రి 00:13/00:15 గంటలకు వైట్‌ఫీల్డ్ చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 09:53/09:55 గంటలకు గూడూరు, మధ్యాహ్నం 11:58/12:00 గంటలకు ఒంగోలు, మధ్యాహ్నం 14:55/15:05 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం 18:18/18:20 గంటలకు వరంగల్ చేరుకుని, రాత్రి 23:01/23:03 గంటలకు ఆరా మీదుగా ప్రయాణించి, చివరికి అర్ధరాత్రి 00:15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.

ఈ రైలును శాశ్వత ప్రాతిపదికన ప్రతిరోజూ నడపడం వల్ల ఐటీ రాజధాని బెంగళూరులో పనిచేసే తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులతో పాటు బీహార్ ప్రాంతానికి చెందిన వలస కార్మికులకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన సమయంలో రిజర్వేషన్లు దొరకక ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu