ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే ఉపశమనంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మట్టి కుండలో నీళ్లు తాగితే మంచిది. మట్టి కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. వేడి నుంచి వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు.
అంతేకాదు, మట్టితో చేసిన కుండను ఇంట్లో పెడితే సానుకూల శక్తి కూడా ఉంటుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వేసవికి మీరు కూడా మట్టి కుండను కొనాలని అనుకుంటున్నారా? అయితే ఏ దిశలో పెట్టాలో కూడా తెలుసుకోండి.
మట్టి కుండ వలన కలిగే లాభాలు? వాస్తు ప్రకారం మట్టి కుండ ఏ దిశలో ఉండాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. అయితే సరైన దిశలో పెడితే శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుంది. లేకపోతే సమస్యలు వస్తాయి. మట్టి కుండ ఇంట్లో ఉంటే మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. సరైన దిశలో మట్టి కుండను పెడితే ఇంట్లో శక్తి సమతుల్యంగా ఉంటుంది. మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. మట్టి కుండను పూజ గదిలో పెడితే ఇంటి మొత్తం సానుకూల శక్తితో నిండిపోతుంది. మట్టి కుండ ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు కూడా రావు. చాలా రకాల వ్యాధుల నుంచి ఇది రక్షణ అందిస్తుంది. మట్టి కుండను ఇంట్లో ఉంచడం వలన ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధం దృఢంగా మారుతుంది. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.
ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉంచండి:
మట్టి కుండను ఎప్పుడు ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఉత్తరం కుబేరుడి దిశగా భావిస్తారు. ఆ దిశలో మట్టి కుండ ఉంటే ధన ప్రవాహానికి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అయితే మట్టి కుండను ఇంట్లో పెట్టినప్పుడు కుండ ఖాళీగా లేకుండా చూసుకోండి. ఎప్పుడూ నిండుగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఉంచడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
మట్టి కుండ దగ్గర సాయంత్రం పూట ఒక దీపం పెట్టండి. ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. మట్టి కుండ విషయంలో చిన్న పొరపాటు కూడా లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా విరిగిపోయిన, పగిలిపోయిన కుండలను ఇంట్లో పెట్టకూడదు. అవి ప్రతికూల శక్తికి కారణం అవుతాయి. కానీ మట్టి కుండను నిండుగా, ఇక్కడ చెప్పిన దిశల్లో ఉంచినట్లయితే సిరి సంపదలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అదృష్టం కూడా పెరుగుతుంది.
ఇంట్లో సంపద పెరగడానికి ఈ చిట్కాలను కూడా పాటించండి:
1.తులసి మొక్క:
ప్రతిరోజు తులసి మొక్కకు నీటిని సమర్పించి, తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది సానుకూల శక్తిని తీసుకొస్తుంది. మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది.
2.అనవసరమైన వస్తువులను తొలగించండి:
ఇంట్లో అనవసరమైన వస్తువులను తొలగించండి. పనికిరాని సామాన్లు సానుకూల శక్తికి అడ్డుపడతాయి. అలాంటి వాటిని తొలగిస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఆనందంగా ఉండొచ్చు.
3.మనీ ప్లాంట్ పెట్టండి:
ఇంట్లో ఒక మనీ ప్లాంట్ పెట్టండి. ఇది కూడా సానుకూల శక్తిని కలిగేలా చేస్తుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత, కెరీర్‌లో ఊహించిన మార్పులు చూడొచ్చు.
4.ముఖద్వారం:
ఇంటి ముఖద్వారం దగ్గర ప్రతి రోజు నీళ్లు జల్లి శుభ్రం చేయండి. ఇది సానుకూల శక్తిని పెంచి, ప్రతికూల శక్తిని తొలగించేలా చేస్తుంది. అలాగే ఒక రాగి పాత్రలో నీటిని నింపి ముఖద్వారం వద్ద ఉంచండి.
Peddinti Sravya, hyderabad

