Dailyhunt
Venus Transit: ఏప్రిల్ నెలలో నాలుగు సార్లు శుక్ర సంచారంలో మార్పు.. మూడు రాశుల ఆదాయం పెరుగుతుంది, పదోన్నతులు!

Venus Transit: ఏప్రిల్ నెలలో నాలుగు సార్లు శుక్ర సంచారంలో మార్పు.. మూడు రాశుల ఆదాయం పెరుగుతుంది, పదోన్నతులు!

బ్బు, విలాసాలు, ప్రేమ, సంతోషం మొదలైన వాటికి కారకుడు శుక్రుడు. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అన్ని రాశుల వారిపై శుక్రుని మార్పుతో ఎంతో కొంత ప్రభావం పడుతుంది.

కొన్నిసార్లు కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఏప్రిల్ నెలలో చూసినట్లయితే, శుక్రుడు ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా నాలుగు సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. ఏప్రిల్ నెలలో శుక్ర సంచారంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? శుక్ర సంచారంలో మార్పు ఏ రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకు రాబోతుందో తెలుసుకుందాం.

ఏప్రిల్ నెలలో నాలుగు సార్లు శుక్రుడి సంచారంలో మార్పు

ఏప్రిల్ నెలలో శుక్రవారం చాలా విశేషమైనది. నాలుగు సార్లు శుక్రుడి రాశి సంచారంలో మార్పు ఉండటంతో అనేక విధాలుగా మార్పులు వస్తాయి. మొదట, ఏప్రిల్ 5న శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత, ఏప్రిల్ 16న శుక్రుడు కృత్తికా నక్షత్రంలోకి అడుగుపెడతాడు.

ఆ తర్వాత, ఏప్రిల్ 19న మధ్యాహ్నం 3:51కి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత, ఏప్రిల్ 27న రాత్రి 9:08కి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా శుక్రుడి సంచారంలో మార్పు ఉంటుంది. ఇది కొన్ని రాశుల వారికి ఊహించని విధాలుగా లాభాలను తీసుకొస్తుంది.

1.తులా రాశి:

తులా రాశి వారికి ఏప్రిల్ చాలా బాగుంటుంది. తులా రాశి వారు పెద్ద పెద్ద డీల్స్‌ను పొందుతారు. కెరీర్‌లో అద్భుతమైన మార్పులను చూస్తారు. వివిధ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతోషం, డబ్బు పెరుగుతాయి. తెల్లటి వస్తువులను దానం చేస్తే మరింత శుభ ఫలితాలను పొందవచ్చు.

2.వృషభ రాశి:

ఈ రాశి వారికి కూడా ఏప్రిల్ బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు, లాభాలను పొందుతారు. ఆనందంగా ఉంటారు. సంతోషం రెట్టింపు అవుతుంది. శుక్ర సంచారం ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలను తెస్తుంది.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబంతో ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు.

Peddinti Sravya, hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu