Vijay Family: ప్రయాణం సాధారణంగానే మొదలవుతుంది.. కానీ విజయం దక్కిన తర్వాతే అది ప్రభంజనం అవుతుంది. ఇప్పుడా ప్రభంజనం పేరు దళపతి విజయ్. తమిళనాడు 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే హిస్టరీ క్రియేట్ చేసింది.
అయితే ఫ్యామిలీ సవాళ్లు దాటి విజయ్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే ఈ విక్టరీ సాధ్యమైంది.
సొంతవాళ్లే దూరం
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. కానీ దళపతి విజయ్ కు ఇంట్లోనే తీవ్రమైన సమస్యలు తలెత్తాయి. తండ్రి, భార్య, కొడుకు తో విభేధాలు వచ్చాయి. పార్టీ పెట్టే సమయంలోనే తండ్రి చంద్రశేఖర్ వ్యతిరేకించాడు. కొడుకు పెట్టే పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓపెన్ గానే మాట్లాడాడు. ఇప్పుడేమో కొడుకు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
భార్య విడాకులు
టీవీకే పార్టీ స్థాపించి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న వేళ దళపతి విజయ్ కు బిగ్ షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలని అతని భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కింది. విజయ్ కు మరో హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఈ పరిణామం విజయ్ పై బాంబ్ లా పడింది.
కొడుకు కూడా
విజయ్, సంగీత విడాకుల విషయం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సమయంలోనే కొడుకు జేసన్ సంజయ్ కూడా తండ్రికి దూరమయ్యాడు. తల్లి సంగీతకు సపోర్ట్ గా నిలిచిన అతను.. సోషల్ మీడియాలో విజయ్ ను అన్ ఫాలో చేయడం సంచలనంగా మారింది.
త్రిషతో సంబంధం
త్రిషతో విజయ్ కు అక్రమ సంబంధం ఉందనే రూమర్లు కూడా విజయ్ ను బాగా ఇబ్బంది పెట్టాయి. అతని భార్య సంగీత ఆరోపించిన హీరోయిన్ త్రిషనే అనే పుకార్లు షికార్లు చేశాయి. త్రిష పేరుతో విజయ్ పై విమర్శలు గుప్పించారు.
ఇంట్లో వాళ్ల ఓట్లయినా
తండ్రితో విభేధాలు, విడాకుల కోరుతూ భార్య, కొడుకు దూరం, త్రిషతో రిలేషన్ షిప్ పుకార్లు.. ఇలా దళపతి విజయ్ ను ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ చుట్టుముట్టాయి. ప్రత్యర్థి పార్టీలకు విమర్శలు గుప్పించేందుకు ఇవే ఆయుధాలుగా మారాయి. దీంతో విజయ్ కు ఇంట్లో వాళ్ల ఓట్లయినా పడతాయా? అని ప్రత్యర్థి పార్టీల నేతలు ఎద్దేవా చేశారు.
జనాల ప్రేమ
సొంతవాళ్లు దూరమైనా, తీవ్రమైన విమర్శలు వచ్చినా విజయ్ ను తమిళనాడు జనాలు నెత్తిన పెట్టుకున్నారు. తమ అభిమాన హీరోపై అమితమైన ప్రేమ కురిపించారు. మరోవైపు విజయ్ కూడా ఏ మాత్రం కుంగిపోకుండా వీరుడిలా పోరాడాడు. ఎన్నికల క్షేత్రంలో అలుపెరగని యుద్ధం చేశాడు. చివరకు జనాల మద్దతుతో అద్భుత విజయం సాధించాడు.
Chandu Shanigarapu

