Dailyhunt
Vijay Trisha: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే హవా.. విజయ్ ఇంటికి త్రిష.. వీడియో వైరల్

Vijay Trisha: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే హవా.. విజయ్ ఇంటికి త్రిష.. వీడియో వైరల్

Vijay Trisha: తమిళనాడులో విజిల్ మోత మోగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టార్ హీరో దళపతి విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం కొనసాగిస్తోంది. ప్రస్తుతం 116 స్థానాల్లో ఉన్న టీవీకే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరైంది.

ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి హీరోయిన్ త్రిష వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ ఇంటికి త్రిష

తమిళనాడు 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ పేరు ఎంతలా మార్మోగిందో, హీరోయిన్ త్రిష పేరు కూడా అంతలా వినిపించింది. విజయ్, త్రిష మధ్య అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు కలకలం రేపాయి. వీళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ఇంటికి త్రిష వెళ్లడం వైరల్ గా మారింది.

వైరల్ వీడియో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాలు వెలువడుతున్న ఈ రోజే (మే 4) త్రిష పుట్టిన రోజు కావడం గమనార్హం. సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న త్రిష.. మధ్యాహ్నం విజయ్ ఇంటికి వెళ్లింది. విజయ్ సీఎం పీఠంపై కూర్చోవడం ఖాయమైన నేపథ్యంలో అతని ఇంటికి త్రిష వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ కు అభినందనలు చెప్పేందుకు త్రిష అక్కడికి వెళ్లిందని సమాచారం.

విజయ్, త్రిష గురించి

దళపతి విజయ్, త్రిష కలిసి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. అయితే విజయ్ భార్య సంగీత ఇటీవల విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. విజయ్ కు మరో హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. ఆ హీరోయిన్ త్రిష అనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత విజయ్, త్రిష కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు వెళ్లడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది.

సీఎం పీఠంపై

దళపతి విజయ్ తన కెరీర్ పీక్ లో ఉండగానే సడెన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. టీవీకే పార్టీ స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశాడు. ఒంటరిగానే తమిళనాడు అసెంబ్లీ 2026 ఎన్నికల్లో పోటీ చేశాడు. అధికార పార్టీ డీఎంకే.. ఏఐఏడీఎంకే, బీజీపీ కూటమిని సవాళ్లను దాటి విజయ్ అదరగొట్టాడు.

ప్రస్తుతం ఫలితాల ప్రకారం విజయ్ పార్టీ టీవీకే ఏకంగా 116 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 118 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ విజయ ఢంకా మోగించి, సీఎం పీఠాన్ని అధిరోహించడం ఖాయమనే చెప్పొచ్చు.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu