Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vivo smartphones : వివో నుంచి 2 కొత్త స్మార్ట్​ఫోన్స్ లాంచ్- 7200ఎంఏహెచ్ బ్యాటరీతో!

Vivo smartphones : వివో నుంచి 2 కొత్త స్మార్ట్​ఫోన్స్ లాంచ్- 7200ఎంఏహెచ్ బ్యాటరీతో!

భారతదేశంలో బడ్జెట్ నుంచి ప్రీమియం శ్రేణి వరకు స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో వీవో బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే ఈ చైనా దిగ్గజం, తాజాగా తన స్వదేశీ మార్కెట్లో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది.

'వీవో జీ5ఐ', 'వీవో జీ5జెడ్' పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బ్రాండింగ్ మినహా ఈ రెండు ఫోన్లలో వాడిన హార్డ్‌వేర్, డిజైన్, మెమరీ ఆప్షన్లు అన్నీ ఒకేలా ఉన్నాయి.

భారీ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్లను డిజైన్ చేశారు. సాధారణంగా మార్కెట్లో 5000ఎంఏహెచ్ లేదా 6000ఎంఏహెచ్ బ్యాటరీలతో ఫోన్లు వస్తుంటాయి. కానీ వీవో ఒకడుగు ముందుకు వేసి ఏకంగా 7,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్లలో అమర్చింది. దీనితో పాటు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లను జోడించింది.

ధర, లభ్యత వివరాలు..

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఒకే రకమైన కాన్ఫిగరేషన్లలో లభిస్తాయి. ప్రస్తుతానికి చైనాలోని వీవో ఈ-స్టోర్ ద్వారా కేవలం 'అబ్సిడియన్ బ్లాక్' కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

6GB ర్యామ్ + 128GB స్టోరేజ్: దీని ధర 2,199 యువాన్లు (మన దేశీ కరెన్సీలో సుమారు రూ. 30,900) గా ఉంది.

8GB ర్యామ్ + 256GB స్టోరేజ్: దీని ధర 2,899 యువాన్లు (మన దేశీ కరెన్సీలో సుమారు రూ. 40,700) గా నిర్ణయించారు.

ప్రస్తుతం చైనాలో విడుదలైన ఈ సిరీస్ రాబోయే రోజుల్లో భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, మన రూపాయి విలువ, పన్నుల ఆధారంగా భారత్‌లో ధరల్లో మార్పులు ఉండవచ్చు.

డిస్‌ప్లే, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్..

వీవో జీ5ఐ, వివో జీ5జెడ్ మోడల్స్ 6.75-ఇంచుల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. ఇది 1570 x 720 పిక్సెల్స్ రెజల్యూషన్, 120హెచ్​జెడ్ రీఫ్రెష్ రేట్, 240హెచ్​జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 4ఎన్​ఎం ఆర్కిటెక్చర్‌పై తయారైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. దీనికి అడ్రినో 613 జీపీయూతో పాటు గరిష్టంగా 8GB LPDDR5 ర్యామ్, 256GB యూఎఫ్​ఎస్ 3.1 స్టోరేజ్ జతచేశారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్లు రన్ అవుతాయి. ఇందులో వీవోకు చెందిన 'బ్లూ హార్ట్ లిటిల్ వి' అనే ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది.

కెమెరా, కనెక్టివిటీ ఫీచర్లు..

ఫోటోగ్రఫీ కోసం ఈ మొబైళ్ల వెనుక భాగంలో ఆటోఫోకస్ సపోర్ట్ ఉన్న 50-మెగాపిక్సెల్ సింగిల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఇది f/1.8 అపెర్చర్ మరియు 10ఎక్స్ డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. అయితే ఈ ఫోన్లలో ఆప్టికల్ లేదా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్/ ఈఐఎస్) ఫీచర్లు లేవు. అయినప్పటికీ బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాల ద్వారా 1080పీ క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

మంచి ఆడియో అనుభూతి కోసం స్టీరియో డ్యూయల్ స్పీకర్లను అందించారు. కనెక్టివిటీ పరంగా చూస్తే 5జీ నెట్‌వర్క్, డ్యూయల్ నానో సిమ్, వై-ఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఇంటిలిజెంట్ రిమోట్‌గా వాడుకోవడానికి ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ కూడా ఉంది.

మిలిటరీ గ్రేడ్ భద్రత.. రివర్స్ ఛార్జింగ్

ఈ ఫోన్ల ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ లైఫ్. 7,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక ఇస్తుంది. ఇది 44డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అత్యవసర సమయాల్లో ఇతర ఫోన్లను ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ఓటీజీ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం. ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌కు ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే నీటిలో పడినా, ధూళి చేరినా ఫోన్ పాడవదు. అంతేకాకుండా ఫైవ్-స్టార్ డ్రాప్ అండ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల పొరపాటున కింద పడినా గట్టి దెబ్బలను తట్టుకోగలదు.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu