Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

24 గంటల్లో సాయం అందించిన సీఎంచంద్రబాబు

నరసన్నపేట,, 20 మే (హి.స.)

దుకోవాలని కోరిన 24 గంటల్లోనే సీఎం చంద్రబాబు స్పందించి.. సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. 'స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ఈ నెల 16న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటించారు.

స్థానిక హనుమాన్నగర్కు చెందిన గొర్లె జ్యోతి, సింహాద్రి భాస్కరరావు సీఎంను కలిసి తమ గోడు వినిపించారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నామని, ఉన్నదంతా వైద్యకోసం ఖర్చు చేసేశామని, తమను ఆదుకోవాలని వేడుకున్నారు. దీనిపై చంద్రబాబు వెంటనే స్పందించారు. దీంతో వారికి సాయం అందించేలా ఈ నెల 17నే సీఎంవో నుంచి కలెక్టర్కు ఆదేశాలు అందాయి. ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున సీఎం మంజూరు చేశారు. ఆ చెక్కులను నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద వారికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు నియోజవర్గంలో రూ.3కోట్లు అందజేశామన్నారు. కాగా, ఈ నెల 16న విధుల్లో అంకితభావం చూపిన పారిశుధ్య కార్మికులు పి. జయంతికి సీఎం చంద్రబాబు చేతులమీదుగా అవార్డును అందజేశారు. ఆమెతో సీఎం కాసేపు మాట్లాడా రు. సమస్యల గురించి అడిగారు. అయితే, ఆమె సీఎంతో మాట్లాడే ధైర్యం లేక తన సమస్యలు చెప్పుకోలేకపోయారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తికి ఆమె తన గోడు వినిపించారు. సొంతిల్లు లేదని, మంజూరు చేయాలని వేడుకున్నారు. దీంతో ఇల్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఎమ్మెల్యే సూచించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu