Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

37 కిలోల బరువున్న చేప లభ్యం

ఏలూరు, మే 18 (హి.స)

లూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం వద్ద గల ఎర్రకాలువ జలాశయంలో మత్స్యకారులకు 37 కిలోల బరువున్న భారీ చేప చిక్కింది.

ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారుల వలకు ఈ భారీ జలచరం దొరకడం విశేషం.ఈ భారీ చేపను విక్రయించేందుకు పుట్లగట్లగూడెం గ్రామానికి తీసుకురాగా, దానిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. ఆరు నెలల విరామం తర్వాత ఇంత పెద్ద చేప పడటంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ భారీ చేపను అదే ప్రాంతానికి చెందిన మువ్వా అభిరామ్ అనే స్థానిక వ్యక్తి రూ.9,250 చెల్లించి కొనుగోలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu