Dailyhunt

650 కోట్లకుపైగా విలువైన నగదు, మాదకద్రవ్యాలు, మద్యం పట్టుబడ్డాయి... ఈసీ

ఢిల్లీ, 05 ఏప్రిల్ (హి.స.)

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 650 కోట్లకుపైగా విలువైన నగదు, మాదకద్రవ్యాలు, మద్యం పట్టుబడినట్లు ఈసీ తెలిపింది.

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాటిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు వివరించింది. అత్యధికంగా బంగాల్లో 319 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మద్యం, బంగారు ఆభరణాలను సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. తమిళనాడులో 170 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడినట్లు పేర్కొంది. ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించేందుకు 5వేల 173కి పైగా ఫ్లయింగ్ స్క్వాడ్లను ఈసీ మోహరించింది. వాహనాలను తనిఖీ చేసేందుకు 5వేల 200 మందితో నిఘా బృందాన్ని ఏర్పాటు చేసింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఈనెల 9న పోలింగ్ జరగనుండగా తమిళనాడులో ఈనెల 23న ఓటింగ్ జరగనుంది. పశ్చిమ్ బెంగాల్లో ఈనెల 23, 29న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు వచ్చే నెల 4న వెలువడనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu