Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

66 ఏళ్ల వృద్ధుడి కి 20 ఏళ్ల జైలు శిక్ష

అమరావతి, 19 మే (హి.స.)

చిలీపట్నం కార్పొరేషన్, బాలికపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని కలిదిండి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక స్థానిక చర్చి వద్ద ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన పరసా బ్రహ్మయ్య చాక్లెట్ ఆశ చూపి పక్కనున్న పాడుపడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి విషయాన్ని చర్చిలో ఉన్న తల్లికి వివరించడంతోపాటు అతన్ని పట్టుకొని బుద్ధిచెప్పారు. 2020 ఫిబ్రవరి 5న జరిగిన ఈ ఘటనపై మండవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.

ఈ కేసుపై మచిలీపట్నంలోని పోక్సో కోర్టులో విచారణ నిర్వహించగా.. నిందితుడిపై నేరం రుజువైంది. బ్రహ్మయ్య(66)కు 20 ఏళ్లు జైలు.. రూ.10 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు సోమవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలు అదనంగా జైలు శిక్ష విధించాలని తీర్పులో పేర్కొన్నారు. విక్టిమ్ కాంపన్సేషన్ స్కీం కింద రూ.ఆరు లక్షలు బాధితురాలికి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదివాడ వెంకట నరసింహారావు 14 మంది సాక్షులను విచారించి వాదనలు వినిపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu